Naga chaithanya : నాగ చైతన్య తో పూజా హెగ్డే.. ఒప్పుకుంటే గొప్పే అంటున్న నెటిజన్స్ ..?
Naga chaithanya : నాగ చైతన్య తో పూజా హెగ్డే మళ్ళీ నటించబోతుందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అయితే పూజా హెగ్డే బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు కమిటయింది. ఒకటి కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా రణ్ వీర్ సింగ్ తో నటిస్తోంది. ఈ రెండు సినిమాల కోసం పూజా హెగ్డే బల్క్ డేట్స్ కేటాయించిందని అంటున్నారు. ఇక టాలీవుడ్ లో ప్రభాస్ తో రాధే శ్యాం అన్న పాన్ ఇండియన్ సినిమా చేసింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన రాధే శ్యాం హిట్ అయితే పూజా హెగ్డే కి పాన్ ఇండియన్ రేంజ్ లో క్రేజ్ వచ్చేస్తుంది.

naga-chaithanya-pooja-hegdae-is-going-to-pair-up-once-again
ఇక అక్కినేని అఖిల్ కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అన్న సినిమా చేస్తోంది. ఈ సినిమా కూడా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా జూన్ 19 న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా సక్సస్ సగం పూజా హెగ్డే మీదే ఆధారపడి ఉందని చెప్పుకుంటున్నారు. కాగా కొత్తగా పూజా హెగ్డే టాలీవుడ్ లో ఇంకా ఏ ప్రాజెక్ట్ కమిటవలేదు. ప్రచారంలో మాత్రం ఎన్.టి.ఆర్ – త్రివిక్రం కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా అలాగే హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలలో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Naga chaithanya : పూజా గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట..!
కాగా మరొకసారి అక్కినేని నాగ చైతన్య కి జంటగా పూజా హెగ్డే నటించబోతుందని లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. 2014 లో నాగ చైతన్య నటించిన ఒకలైలా కోసం సినిమాలో నటించింది. ఈ సినిమా ద్వారానే పూజా హెగ్డే టాలీవుడ్ కి పరిచయం అయింది. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి అఖిల్ తో జత కట్టబోతుందట. అఖిల్ ప్రస్తుతం థ్యాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి విక్రం కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పూజా గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.