Naga Shaurya : రితూవర్మతో నాకు గొడవలేమీ లేవన్న నాగశైర్య..!
Naga Shaurya : టాలీవుడ్ యంగ్ హీరో నాగశైర్య సెలక్టెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకున్నాడు. నాగశౌర్య ప్రేక్షకులకు చివరగా ‘అశ్వత్థామ’ చిత్రంలో కనిపించగా, ఆయన నటించిన తదుపరి చిత్రాలేవీ కూడా కొవిడ్ వల్ల విడుదల కాలేదు. కాగా, నాగశైర్య, రితూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతున్నది. ఈ క్రమంలో సినిమా ఈవెంట్‌లో నాగశౌర్య రితూవర్మపై పలు కామెంట్స్ చేశాడు. లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో వచ్చిన ‘వరుడు కావలెను’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానా చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు.
ఇకపోతే ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చగా, చిత్రం నుంచి విడుదలైన ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ట్రెండింగ్‌లో ఉంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం కథ తనకు చెప్పినప్పుడే హిట్ అని భావించానని, హిట్ అవుతుందని నాగశౌర్య ధీమా వ్యక్తం చేశాడు. మూవీకి గణేశ్ రావూరి మాటలు రాశారని, ప్రొడ్యూసర్స్ నాగవంశీ, చినబాబు సహకారంతోనే సినిమా పూర్తయిందని, వాళ్లు ప్రొఫెషనల్స్ అని చెప్పాడు.
Naga Shaurya : తన పాత సినిమాలకు ఈ సినిమాకు డిఫరెన్స్ ఉందన్న నాగశౌర్య..
‘ఛలో’ సినిమా సక్సెస్ మీట్‌లో తనకు కథ చెప్తానని లక్ష్మీ సౌజన్య అందని, అలా ఆ తర్వాత ఆమె కథ చెప్పగానే ఓకే చేశానని చెప్పాడు నాగశౌర్య. సినిమాలో తనను చాలా నీట్‌గా చూపించిందని అన్నాడు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రితూ వర్మ రాలేదని చెప్పాడు. ఈ క్రమంలోనే తనకు రితూవర్మకు ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశాడు. రితూ వర్మ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అని, నెక్స్ట్ ఈవెంట్‌కు రితూ వస్తుందని హామీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా కోసం తాను 16 కేజీల బరువు తగ్గానని, అదే తన పాత సినిమాలకు ఈ సినిమాకు డిఫరెన్స్ అని నాగశైర్య చెప్పాడు.