Ritu Varma : కథ డిమాండ్ చేస్తే ముద్దుకి సిద్ధం అంటున్న రీతూ వర్మ.. డేరింగ్ స్టెప్ వేసిందిగా..!
ప్రధానాంశాలు:
Ritu Varma : కథ డిమాండ్ చేస్తే ముద్దుకి సిద్ధం అంటున్న రీతూ వర్మ.. డేరింగ్ స్టెప్ వేసిందిగా..!
Ritu Varma : షార్ట్ ఫిల్మ్‌లో చేసి ఆ తర్వాత హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులని అలరించింది రీతూ వర్మ Ritu Varma. చాలా సినిమాలలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో మెప్పించిన కూడా ఈ భామకి సరైన హిట్ పడడం లేదు. ఇప్పుడు సందీప్ కిషన్‌తో కలిసి మజాకా అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాతో అయిన మంచి హిట్ కొట్టాలని చూస్తుంది. ‘మజాకా’తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నటి రీతూ వర్మ సిద్ధమవుతున్నారు.

Ritu Varma : కథ డిమాండ్ చేస్తే ముద్దుకి సిద్ధం అంటున్న రీతూ వర్మ.. డేరింగ్ స్టెప్ వేసిందిగా..!
Ritu Varma ముద్దుకు సై..
ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్‌స్క్రీన్ ముద్దు Kss సన్నివేశాలకు తాను వ్యతిరేకం కాదని, కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఇప్పటివరకు తనకు అలాంటి అవకాశాలు రాలేదని, అయితే కొంతమంది ముందుగానే ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదని ఓ నిర్ణయానికి వస్తారన్నారు.
అందుకే అలాంటి కథలు తన వద్దకు రావడం లేదనుకుంటానని రీతూ వర్మ వ్యాఖ్యానించారు. తన గత చిత్రం ‘స్వాగ్’ swag పరాజయంపై స్పందిస్తూ.. ‘ఆ సినిమా అందరికీ కాకుండా ఒక ప్రత్యేకమైన ప్రేక్షక వర్గానికి మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తామకు ముందుగానే తెలుసు అని చెప్పారు. ‘పెళ్లి చూపులు’ తన కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా అని, స్నేహితులంతా కలిసి చిన్న బడ్జెట్‌తో ఈ సినిమాను తీశామన్నారు. దాని ఫలితం అలా ఉంటుందని తాము ఊహించలేదన్నారు రీతూ వర్మ.