Upasana : ఉపాసన పై మెగాబ్రదర్ సంచలన వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో హాట్ టాపిక్

Authored By vamana sai | The Telugu News | Updated on: June 19, 2021, 1:47 pm

Upasana : మెగా పవర్ స్టార్ రాం చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసనపై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాగబాబు ఏవిషయం అయినా కుండబద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా మాట్లాడతాడన్న విషయం తెలిసిందే. ఏది లోపల దాచుకోకుండా బయటకు అనేస్తారు. దాని పర్యావసానం ఎలా ఉంటుందో అని కూడా జంకే తత్వం నాగబాబుది కాదు. ఇప్పటికే ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను నిర్భయంగా మాట్లాడిన సందర్భాలున్నాయి.

Nagababu Comments on Upasana

Nagababu Comments on Upasana

Upasana మెగా కోడలు ఉపాసనమీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు

కేవలం సినిమా, రాజకీయ నాయకులమీదనే కాదు తన ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన విషయాలను అలాగే ఓపెన్ అవుతారు. ఇదే క్రమంలో మరోసారి నాగబాబు మెగా కోడలు ఉపాసన Upasana మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. ఉపాసన Upasana సోషల్ మీడియాలో నిరంతరం సామాజిక అంశాల పై స్పందిస్తూ.. హెల్త్ తో పాటు తన కుటుంబ విషయాలు కూడా తెలియజేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. మెగా ఫ్యామిలీ కోడలిగా ఇంటి బాధ్యతలతో పాటు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు కూడా చూసుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు మధ్య మధ్యలో సెలబ్రిటీల డైట్స్ కి సంబంధించిన పలు ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా విషయాలను వెల్లడిస్తున్నారు.

Nagababu Comments on Upasana

Nagababu Comments on Upasana

Upasana : ఈ విషయంలో మా మెగాస్టార్ కోడలు అనిపించుకుంది.

దీనికి సంబంధించి తాజాగా నాగబాబు మాట్లాడారు. ఉపాసన Upasana అంతపెద్ద అపోలో హాస్పిటల్స్ నుండి కరోనా టైంలో చాలా తక్కువ ఖర్చులకు ట్రీట్మెంట్ అందించిందని తెలిపారు. అంత తక్కువ ఖర్చుకు ఎలా సాధ్యం అవుతుందని అడిగితే, ఇలాంటి సమయంలోనే కదా సహాయం చేయాల్సింది అంటూ చెప్తే ఆమె గొప్పతనం అర్థమై చాలా సంతోషించానని అన్నారు. ఈ విషయంలో మా మెగాస్టార్ కోడలు అనిపించుకుంది అంటూ కామెంట్స్ చేశారు. అంతేకాదు సినీ కార్మికులకు వాక్సినేషన్ డ్రైవ్ లోనూ ఉపాసన పాత్ర చాలా ఉందని బయటపెట్టారు. ఇక ఈమె బయటకు ప్రచారం చేసుకోకుండా కరోనా టైంలో శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చాలా వరకు తను చేసే సేవా కార్యక్రమాలను బయట పెట్టకపోవడం ఆమె గొప్పతనం.

ఇది కూడా చ‌ద‌వండి==> Chiru-Pawan : ఆ సారైనా మ‌ల్టీస్టార‌ర్ హీట్ అవుతుందా..?

ఇది కూడా చ‌ద‌వండి==> Suman : హీరో సుమన్ క్లిష్ట పరిస్థితుల్లో మనవరాలినిచ్చి పెళ్లి చేసిన టాలీవుడ్ దిగ్గ‌జం ఎవ‌రో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి==> Corona Warrior : ఆటో డ్రైవరైనా ఎందరినో ఆదుకున్నాడు.. ఇప్పుడాయన కుటుంబానికి దిక్కెవ‌రు..?

ఇది కూడా చ‌ద‌వండి==> Miracle : చనిపోయాడని చెప్పి చాప చుట్టేసిన డాక్టర్లు.. తల్లి ఏడుపుతో తిరిగొచ్చిన పిల్లాడి ప్రాణాలు..

vamana sai

No bio available for this author.

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp