Varun Tej : హీరోయిన్‌తో ప్రైవేట్ పార్టీలలో మెరుస్తున్న వరుణ్ తేజ్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి రిలేషన్ షిప్ గురించి కొద్ది రోజులుగా జోరుగా ప్రచారాలు నడుస్తున్న విషయం తెలిసిందే. . బెంగుళూరులో ఉన్న లావణ్యను వరుణ్ తేజ్ వెడ్డింగ్ రింగ్ తీసుకొని కలవవడానికి వెళ్లాడని, పెళ్లి ప్రకటన రాబోతుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడిచింది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడం పక్కా అని కూడా కొందరు ప్రచారం చేశారు. కాని ఇందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు లావణ్య. అయితే తాజాగా లావణ్య, వరుణ్ తేజ్ కలిసి ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొనడం చర్చనీయాంశం అయ్యింది. కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వీరిద్దరూ హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో వరుణ్ తేజ్, లావణ్యతో పాటు ధరమ్ తేజ్, నితిన్ భార్య షాలిని కూడా పాల్గొన్నట్లు సమాచారం.
Varun Tej : నాగబాబు వార్నింగ్..
దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో వీరి వ్యవహారం మరో సారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడం పక్కా అని కొందరు జోస్యాలు చెప్పుకొస్తున్నారు. కాగా వరుణ్, లావణ్య ఇద్దరూ ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన గని సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఎఫ్-3 సినిమా తో హిట్టుతో మళ్లీ సక్సెస్ బాటలోకి వచ్చాడు. ఇలా వరుణ్ తేజ్ కెరియర్ హిట్లు ప్లాపుల నడుమ ముందుకు పోతోంది.
అయితే పార్టీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా కనిపించే సరికి నాగబాబు వరుణ్ తేజ్ ని పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. హీరోయిన్స్ ని ఇంటి కోడలిగా తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు లావణ్యకి ఎంత దూరంగా ఉంటే అంత మంచింది. నువ్వు నా మాట వినకపోతే నా కోపానికి బలవుతావని వరుణ్ తేజ్ కి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని సమాచారం.అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కాని సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అనేక ప్రచారాలు నడుస్తున్నాయి.