Nagarjuna : ఇప్పుడేమంటావ్ బంగార్రాజు.. అయినా రిలీజ్ చేస్తావా?
Nagarjuna : నాగార్జున హీరోగా దాదాపు అయిదేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న బంగార్రాజు సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా అంచనాలు ఉన్నాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించాడు. నాగార్జున మరియు నాగ చైతన్యలు ఈ సినిమా లో తాత మనవడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు కూడా బంగార్రాజు పాత్రల్లోనే కనిపించబోతున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. అయితే పరిస్థితులు సినిమాల విడుదలకు అనుకూలంగా లేవు.
ఏపీలో థర్డ్ వేవ్ నేపథ్యంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్త పడ్డ జగన్ ప్రభుత్వం వెంటనే కొన్ని ముఖ్య మైన ఏరియాల్లో నైట్ కర్ఫ్యూ ను సీరియస్ గా ఇంప్లిమెంట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా థియేటర్ల వద్ద 50 శాతం ఆక్యుపెన్సీ తప్పదు అన్నట్లుగా కూడా ప్రభుత్వ ఆలోచన ఉంది. ఏపీ లో కేసుల సంఖ్య సంక్రాంతి తర్వాత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఆరోగ్య శాఖ నివేదిక నేపథ్యంలో సంక్రాంతి సంబరాలను ఎంత వరకు తగ్గిస్తే అంత మంచిది అన్నట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే థియేటర్లపై ఆంక్షలు గట్టిగానే ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Nagarjuna బంగార్రాజు వాయిదా పడక తప్పదా..!
ఈ సమయంలో నాగార్జున బంగార్రాజు సినిమాను మొండిగా వాయిదా వేస్తారా లేదంటే వాయిదా వేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అభిమానులు మాత్రం బంగార్రాజు ను విడుదల చేయాల్సిందే అన్నట్లుగా డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రా్లలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి కనుక ప్రభుత్వాలు స్వల్ప ఆంక్షలు పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా ను విడుదల చేయాల్సిందిగా అక్కినేని అభిమానులతో పాటు సంక్రాంతి సినిమాల కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు కోరుకుంటున్నారు. సంక్రాంతికి సినిమాలు విడుదల లేకుండా చాలా నష్టం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. మరి బంగార్రాజు నిర్ణయం ఏంటీ అనేది చూడాలి. ఇప్పటి వరకు అయితే సినిమా విడుదల కన్ఫర్మ్ అన్నట్లుగానే ఉన్నారు. ప్రమోషన్స్ కూడా చకచక జరుగుతున్నాయి. కనుక విడుదల వాయిదాకు అవకాశాలు తక్కువ శాతం.