Bangarraju movie : బంగార్రాజు కథ లీక్… అదిరిపోయే స్టోరీ.. సోషల్ మీడియాలో వైరల్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bangarraju movie : బంగార్రాజు కథ లీక్… అదిరిపోయే స్టోరీ.. సోషల్ మీడియాలో వైరల్!

అక్కినేని నాగార్జున, ఆయన పెద్ద కొడుకు చైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా బంగార్రాజు రోజురోజుకూ అభిమానుల్లో అంచనాలను పెంచుతూ పోతోంది. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పాటను విడుదల చేస్తూ చిత్రం బృందం అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటోంది. సోగ్గాడే చిన్ని నాయనాలో బంగార్రాజు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తే.. బంగార్రాజు సినిమాలో ఆయన చనిపోక ముందు జరిగిన కథను చూపించనున్నారని ఇప్పటికే […]

 Authored By kranthi | The Telugu News | Updated on :7 December 2021,10:20 am

అక్కినేని నాగార్జున, ఆయన పెద్ద కొడుకు చైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా బంగార్రాజు రోజురోజుకూ అభిమానుల్లో అంచనాలను పెంచుతూ పోతోంది. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పాటను విడుదల చేస్తూ చిత్రం బృందం అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటోంది. సోగ్గాడే చిన్ని నాయనాలో బంగార్రాజు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తే.. బంగార్రాజు సినిమాలో ఆయన చనిపోక ముందు జరిగిన కథను చూపించనున్నారని ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. అయితే ఇదే బంగార్రాజు పూర్తి కథ అంటూ ఓ స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో సీనియర్ బంగార్రాజుగా నాగ్, జూనియర్ బంగార్రాజుగా చైతన్య నటించనున్నారని తెలుస్తోంది. మొదటి బంగార్రాజు నాగార్జున చనిపోయి స్వర్ఘంలో ఉంటూ ఉండగా.. ఆయన మనవడు చైతు మరో బంగార్రాజుగా భూమ్మీద ఉంటారని సమాచారం. అలా తల్లి దండ్రులు లేని జూనియర్ బంగార్రాజు ఊర్లో ఆకతాయిగా మారతాడట. అలా అల్లరిగా తిరిగే జూనియర్ హీరోకు అదే గ్రామానికి చెందిన ఓ పేరు మోసిన పొలిటికల్‌ లీడర్ కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే దారిలో పడతాడని స్వర్ఘంలో ఉన్న బంగార్రాజు ఆయన భార్య ప్లాన్ వేస్తారట. అందుకు గాను స్వర్గం నుంచి వచ్చి జూనియర్ బంగర్రాజుకు ఆ అమ్మాయి మీద ప్రేమ పుట్టించి చివరకి వారిని ఇద్దరినీ ఒకటిగా ఎలా చేశారు అనేదే అసలు కథ అని సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది.

Nagarjuna Bangarraju movie leak story going viral in social media

Nagarjuna Bangarraju movie leak story going viral in social media

Bangarraju movie : బంగార్రాజు కథ ఇదేనా..!

ఇదే కథ అయితే దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని మరింత రొమాంటిక్ గా, ఫుల్ కామెడీతో తెరకెక్కిస్తారని అంటున్నారు. మరి అసలు కథ ఏంటో తేలాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమా షూటింగ్‌ మొదలై చాలా రోజులు అవుతున్నా… కరోనా కారణంగా షూట్ మధ్య మధ్యలో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2016లో సోగ్గాడే చిన్నినాయనా విడుదలైన తేదీ నాడే అనగా వచ్చే ఏడాది జనవరి 15నే.. విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో నాగ్‌ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది