Bangarraju Movie Review : నాగార్జున బంగార్రాజు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bangarraju Movie Review : నాగార్జున బంగార్రాజు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ

Bangarraju Movie Review : 2016లో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా అనే సినిమాకు బంగార్రాజు సీక్వెల్. 2016లో కూడా సంక్రాంతికి రిలీజ్ అయి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్లీ 2022లో దాని సీక్వెల్ బంగార్రాజు కూడా సంక్రాంతికే రిలీజ్ కావడం విశేషం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా ప్రదర్శించారు. మరి.. సినిమా ఎలా […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 January 2022,6:22 am

Bangarraju Movie Review : 2016లో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా అనే సినిమాకు బంగార్రాజు సీక్వెల్. 2016లో కూడా సంక్రాంతికి రిలీజ్ అయి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్లీ 2022లో దాని సీక్వెల్ బంగార్రాజు కూడా సంక్రాంతికే రిలీజ్ కావడం విశేషం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా ప్రదర్శించారు. మరి.. సినిమా ఎలా ఉంది? నాగార్జున, నాగచైతన్య ఇద్దరూ కలిసి ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను మెప్పించారా? సోగ్గాడే చిన్నినాయనాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా దాన్ని మించిందా? ఎంటర్ టైన్ మెంట్ లో అదరగొట్టేసిందా? తెలుసుకోవాలంటే.. సినిమా స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే.

ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఎక్కడైతే ముగుస్తుందో అక్కడి నుంచే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా ఓపెనింగే.. శివుడి గుడిని చూపిస్తాడు. అక్కడ శివుడి గుడిలో కొన్ని సీన్స్ ప్రారంభం అవుతాయి. యమధర్మరాజుగా నాగబాబు ఎంట్రీ ఇస్తాడు. కొన్ని విషయాల గురించి నాగబాబు ప్రస్తావిస్తాడు.

Bangarraju movie review and live updates

Bangarraju movie review and live updates

Bangarraju Movie Review సినిమా పేరు : బంగార్రాజు.. సోగ్గాడు మళ్లీ వచ్చాడు

నటీనటులు : నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, రావు రమేశ్, నాగబాబు, వెన్నెల కిశోర్, ఝాన్సీ, బ్రహ్మాజీ
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రుబెన్స్
విడుదల తేదీ : 14 జనవరి 2022

నాగచైతన్య జన్మించడం.. ఆయన చిన్నతనం గురించి కొన్ని సీన్లు వస్తాయి. ఆ తర్వాత లడ్డుందా అనే సాంగ్ వస్తుంది. అప్పుడే నాగార్జున ఎంట్రీ ఉంటుంది. రమ్యకృష్ణ, నాగార్జున ఇద్దరూ కలుస్తారు. వాళ్ల మధ్య కొన్ని కామెడీ సీన్లు వస్తాయి. ఆ తర్వాత నాగచైతన్య మాస్ ఎంట్రీ ఉంటుంది. ఊళ్లో ఉన్న అమ్మాయిలకు నాగచైతన్య లైన్ వేస్తుంటాడు. విలేజ్ సెటప్ లో లడ్డుందా అనే పాటకు నాగ చైతన్య డ్యాన్స్ వేస్తుంటాడు.

ఆ తర్వాత నాగచైతన్య, వెన్నెల కిశోర్ మధ్య కొన్ని కామెడీ సీన్లు వస్తాయి. ఆ తర్వాత హీరోయిన్ కృతి శెట్టి ఎంట్రీ ఉంటుంది. తను ఆ ఊరి సర్పంచ్ గా గెలుస్తుంది. సర్పంచ్ గా తను ఊరి కోసం పనులు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత సినిమా మలుపు తీసుకుంటుంది. సీరియస్ కథనంలోకి వెళ్తుంది. శివలింగానికి సంబంధించిన కొన్ని సీన్లు వస్తాయి. ఆ తర్వాత సినిమాలోని విలన్స్ గురించి కూడా ప్రేక్షకులకు తెలుస్తుంది.ఫామ్ హౌస్ లో నాగ చైతన్య మాస్ ఫైట్ ఉంటుంది. అప్పుడే నాగచైతన్య, కృతిశెట్టి తారసపడతారు. ఆ తర్వాత యముడు, ఇంద్రుడి మధ్య కొన్ని సీన్లు వస్తాయి. నాగార్జున, రమ్యకృష్ణ మధ్య మరో లవ్లీ సాంగ్ వస్తుంది.

నాగార్జున తన ఆత్మ నుంచి మనిషిగా మారి.. మళ్లీ భూమ్మీదకు వస్తాడు. ఇప్పుడే అస్సలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. నాగచైతన్యతో నాగార్జున సీన్స్ గమ్మత్తుగా ఉంటాయి. చాలా సరదాగా కాసేపు గడిచిపోతుంది. ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో సూపర్ గా ఉంటారు. ఇద్దరూ చాలా అందంగా కనిపిస్తారు.నాగార్జున, రమ్యకృష్ణ మధ్య రొమాంటిక్ సాంగ్ పూర్తికాగానే.. స్టోరీకి సంబంధించిన కీలక మలుపు జరగుతుంది. ఇదే సినిమాకు హైలైట్. ఆ సీన్ల తర్వాత ఇంటర్వెల్ పడుతుంది.

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో చాలా ఎంటర్ టైనింగ్ గా సాగింది. మధ్యలో రొమాంటిక్ సీన్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా నాగచైతన్య, నాగార్జున మధ్య వచ్చే సీన్లు గూస్ బంప్స్ ను తెప్పిస్తాయి. ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడటానికి రెండు కళ్లు సరిపోవు. కృతిశెట్టి కూడా బాగానే మెప్పించింది. నాగార్జున, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్లు కూడా బాగానే రక్తికట్టించాయి. మరి.. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. నాగచైతన్య… కృతి శెట్టితో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య కాసేపు ప్రేమ సీన్లు వస్తాయి. ఆ తర్వాత మరోసారి స్టోరీ మొత్తం గుడి వైపు తిరుగుతుంది. అక్కడే మరో ట్విస్ట్ ఉంటుంది. సోగ్గాడే చిన్నినాయనాలోని పాత క్యారెక్టర్ ఇప్పుడు మళ్లీ సినిమాలోకి ఎంట్రీ ఇస్తుంది.

ఫ్యామిలీ సెంటిమెంట్ స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తాయి. అలాగే.. ఫ్యామిలీ సాంగ్ నాకోసం కూడా వస్తుంది. ఈ పాటులో విజువల్స్ బాగుంటాయి. ఎమోషనల్ సీన్స్ తర్వాత నాగచైతన్య, కృతి శెట్టికి పెళ్లి అవుతుంది. ఆ తర్వాత మళ్లీ కొన్ని కామెడీ సీన్లు వస్తాయి.

ఆ తర్వాత ఐటెమ్ సాంగ్ వస్తుంది. మరోవైపు నాగచైతన్య యాక్షన్ మోడ్ లోకి వచ్చేస్తాడు. ఫైట్ సీన్ ఉంటుంది. ఫైట్ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్.సినిమా క్లయిమాక్స్ కు దగ్గరికి వచ్చేసింది. ఇంతలో ఒక చిన్న ట్విస్ట్. నాగార్జున, నాగ చైతన్య.. క్లయిమాక్స్ ఫైట్ లోకి దిగుతారు. ఇద్దరూ కలిసి.. విలన్స్ ను చితకబాదుతారు. ఆ తర్వాత సినిమా ఎమోషనల్ గా, కాస్త సంతోషంగా ముగుస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది