Nagarjuna : నాగార్జున ‘బంగార్రాజు’ బడ్జెట్ మరియు ప్రీ రిలీజ్ లెక్కలు.. బ్రేక్ ఈవెన్ కు ఎంత కావాలంటే!
Nagarjuna : నాగార్జున మరియు నాగ చైతన్యలు హీరోలుగా రూపొందిన బంగార్రాజు సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలు విడుదల కాకపోవడం వల్ల బంగార్రాజు కు డబుల్ ప్రాఫిట్ ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. దాదాపుగా 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను జీ సంస్థతో కలిసి నాగార్జున స్వయంగా నిర్మించాడు. సంక్రాంతికి ఈ సినిమా కు పోటీ లేని కారణంగా బయ్యర్లు ఈ సినిమాకు భారీ మొత్తంను పెట్టేందుకు ముందుకు వచ్చారు. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా దాదాపుగా 37.5 కోట్ల కు పైగా అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 40 కోట్ల వరకు షేర్ రావాల్సి ఉంది. అంటే మొత్తంగా బంగార్రాజు సినిమా 80 నుండి 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టాల్సి ఉంది. ఈమద్య కాలంలో ఈ మొత్తం పెద్ద కష్టం ఏమీ కావడం లేదు. బంగార్రాజుకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈజీగా వంద కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం. వంద కోట్ల కలెక్షన్స్ అంటే 50 కోట్లకు పైగా షేర్ వస్తుంది. తద్వారా బయ్యర్లు మరియు నిర్మాతలు కూడా ఫుల్ హ్యాపీ అనడంలో సందేహం లేదు.

Nagarjuna Bangarraju movie budget and pre release business
Nagarjuna ఏరియాల వారిగా నాగార్జున బంగార్రాజు బిజినెస్
నైజాం : 11 కోట్లు
సీడెడ్ : 6.3 కోట్లు
ఉత్తరాంద్ర : 4.15 కోట్లు
ఈస్ట్ గోదావరి : 2.9 కోట్లు
వెస్ట్ గోదావరి : 2.5 కోట్లు
గుంటూరు : 3.3 కోట్లు
కృష్ణ : 2.75 కోట్లు
నెల్లూరు : 1.5 కోట్లు
ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీగానే బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ నెంబర్ త్వరలోనే అఫిషియల్ గా బయటకు వస్తుందేమో చూడాలి.
ఇక ఈ సినిమా ను ఓటీటీ మరియు ఇతర రైట్స్ అమ్మడం ద్వారా మరో 20 నుండి 25 కోట్ల వరకు నిర్మాతలకు ఖాతాలో పడుతుంది. తద్వారా భారీ లాభాలు ఈ సినిమాకు ఇప్పటికే వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. నాగార్జున మరియు నాగ చైతన్య నటించిన సినిమా ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అవ్వడం.. ఉప్పెన వంటి సెన్షేషన్ మూవీలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి నటించిన సినిమా అవ్వడంతో బంగార్రాజు సినిమాకు మంచి క్రేజ్ ఉంది అనడంలో సందేహం లేదు. ఆ క్రేజ్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.