Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్రోమో… ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి కొద‌వ లేద‌ని చెప్పిన నాగార్జున‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్రోమో… ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి కొద‌వ లేద‌ని చెప్పిన నాగార్జున‌

 Authored By sandeep | The Telugu News | Updated on :9 August 2022,11:30 am

Bigg Boss 6 Telugu : తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిస్తూ.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను అందిస్తూ వ‌స్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్.ఈ కార్య‌క్ర‌మం సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్ సీజన్లను, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ షో నుంచి త్వరలోనే ఆరో సీజన్‌తో రాబోతుంది. ఇక, ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. రీసెంట్‌గా షోకి సంబంధించిన లోగో విడుద‌ల చేయ‌గా, ఇది ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక తాజాగా ప్రోమో విడుద‌ల చేశారు…

Bigg Boss 6 Telugu : ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాగార్జున మీద ప్రోమో షూట్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ ప్రోమోలో నాగార్జున లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. అప్ప‌గింత‌ల స‌మ‌యంలో వ‌ధువు త‌ల్లిదండ్రులు కూతుర్ని వ‌దిలి ఉండ‌లేమ‌నే బాధ క‌న్నా బిగ్ బాస్ ని ఎక్క‌డ మిస్ అవుతున్నామ‌నే బాధ ఎక్కువ ప‌డుతున్న‌ట్టు చూపించారు. లైఫ్‌లో ఏ మూమెంట్ అయిన బిగ్ బాస్ త‌ర్వాతే. బిగ్ బాస్ సీజ‌న్ 6..ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ అని ప్రోమోలో నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో ఆక‌ట్టుకుంటుంది. ఇక బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్ల లిస్ట్ కూడా చక్కర్లు కొడుతోంది. అయితే అందులో ఎంత మంది ఉంటారు.. ఎంత మంది ఉండరు అనేది ఇప్పుడే చెెప్పలేం.

Nagarjuna Bigg Boss 6 Telugu Promo Out Now

Nagarjuna Bigg Boss 6 Telugu Promo Out Now

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దీపికా పిల్లి, నేహా చౌదరి, శ్రీహాన్‌, ఆర్జే సూర్య, యాంకర్‌ ఉదయభాను, అమర్‌దీప్‌, ఆదిరెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్‌.. షోలో అడుగు పెట్టబోతున్నారట. గత సీజన్‌లో సిరి రాగా, ఈసారి సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ వస్తుండటంతో అతడి మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ ఇటీవలే తన ప్రేయసి, సహనటి తేజస్వితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. మరి అతడు పెళ్లిని వాయిదా వేసుకుని వస్తాడా? లేదంటే త్వరగా పెళ్లి చేసేసుకుని బిగ్‌బాస్‌ షోకు రెడీ అవుతాడా? అన్నది చూడాలి! ప్రతి సీజన్‌లో ఓ కమెడియన్‌ ఉన్నట్లే ఈసారి కూడా ఓ హాస్యనటుడిని తీసుకురావాలనుకున్నారు. అందులో భాగంగానే చలాకీ చంటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది