Naa Saami Ranga Movie : సంక్రాంతికి ఒక్కొక్కడికి ఉంటది … నా సామి రంగా జాతర ఏంటో చూపిస్తా.. నాగార్జున | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naa Saami Ranga Movie : సంక్రాంతికి ఒక్కొక్కడికి ఉంటది … నా సామి రంగా జాతర ఏంటో చూపిస్తా.. నాగార్జున

 Authored By anusha | The Telugu News | Updated on :11 January 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Naa Saami Ranga Movie : సంక్రాంతికి ఒక్కొక్కడికి ఉంటది ... నా సామి రంగా జాతర ఏంటో చూపిస్తా.. నాగార్జున

Naa Saami Ranga : నాగార్జున నా సామి రంగా మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తన స్పీచ్ మొదలుపెట్టేముందు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న మిగిలిన మూడు సినిమాలకు కూడా నాగార్జున శుభాకాంక్షలు చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ..నేను మా సినిమా గురించి చెప్పేముందు తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పాలి. మనకి సంక్రాంతి అంటే సినిమా పండగ. ఎప్పుడో టీవీలో వచ్చినప్పుడు సినిమాల పని అయిపోయిందని అన్నారు. దాని తర్వాత ఫోన్లు వచ్చాయి. సినిమాలో చూడరు అన్నారు. ఈ మధ్య ఓటీటీ వచ్చింది. అయినా సరే థియేటర్లలో చూస్తూనే ఉన్నారు. కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు. పండగ రోజున సినిమాలు చూడటం అనేది మన ఆనవాయితీ.

మనకి ఎన్ని సినిమాలు వచ్చిన చూస్తారు. మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. ముందుగా ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబుకి ఆల్ ద బెస్ట్ ఫర్ ‘ గుంటూరు కారం ‘. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసిన తేజ సజ్జా హీరోగా వస్తున్న ‘ హనుమాన్ ‘ కి ఆల్ ద బెస్ట్. అలాగే మా వెంకీ 75 సినిమాలు పూర్తి చేసుకొని ‘ సైంధవ్ ‘ గా వస్తున్నాడు. తనకి కూడా బెస్ట్ విషెస్ అంటూ నాగ్ చెప్పారు. తర్వాత నా సామి రంగా సినిమాను మూడు నెలల్లో పూర్తి చేసి విడుదల చేస్తున్నట్లుగా నాగార్జున చెప్పారు. అసలు ఈ సినిమా చేయాలని నమ్మకం నాన్న్ నాకు ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. మేము నా సామి రంగా తో మీ ముందుకు వస్తున్నాను. మీకు మేము మంచి సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తారో రెండు పండగలు చూశాను. ఈ పండగకి కూడా అలానే ఆదరిస్తారని నమ్ముతున్నాను.

ఈ సినిమాకి కీరవాణి గారు ఇచ్చిన పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సినిమాను మూడు నెలల్లో పూర్తి చేసామంటే మా టీం మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవాలి. అందరూ ఒక ఫ్యామిలీగా చేసాం. సెప్టెంబర్ 20 న నాన్నగారి పుట్టినరోజున ఆయనకి 100 సంవత్సరాలు వచ్చిన రోజున విగ్రహం ఆవిష్కరించినప్పుడు దండం పెడుతుంటే నాన్న నా మనసులో చెప్పిన మాట విని చేయ్ రా నా సామి రంగా అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే సినిమాలు పూర్తి చేశాను. వీళ్ళందరి గురించి సక్సెస్ మీట్ లో చెబుతాను. మూడు నెలల్లో సినిమా ఎలా తీయొచ్చా కూడా ఓ పుస్తకం రాసి ఇస్తామని అన్నారు. మరీ సంక్రాంతి పండుగకి అక్కినేని అభిమానులకి ఒక మాట చెప్పాలి. ఈసారి పండగకి కృష్ణయ్య వస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ కొడుతున్నాడు అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది