Nagarjuna : బిగ్ బాస్ భామ‌కి ప‌డిపోయిన నాగార్జున‌.. ఏం చేశాడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : బిగ్ బాస్ భామ‌కి ప‌డిపోయిన నాగార్జున‌.. ఏం చేశాడో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :12 May 2022,6:30 pm

Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు బిగ్ బాస్ వంటి టీవీ షోని కూడా స‌క్సెస్ ఫుల్‌గా హాస్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షో ద్వారా కొద్ది మంది త‌మ టాలెంట్ నిరూపించుకుంటుండ‌గా, వారికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తున్నారు. బిగ్ బాస్ సీజ‌న్ 5లో సందడి చేసిన లహరి శరి ఉన్నన్ని రోజులు అందంతో పాటు తన ప్రవర్తనతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ లో కనిపించిన చాలా మంది వెండి తెరపై సందడి చేయాలని ఆశ పడుతారు. అయితే లహరి మాత్రం వెండి తెరపై చాలా సినిమాల్లో కనిపించింది. బిగ్ బాస్ తర్వాత యాంకర్ గా మంచి పేరు దక్కించుకోవాలనుకుంటున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

బంగార్రాజు సినిమా ప్రమోషన్ సమయంలో లహరి పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే లహరి కి నాగార్జున ఇంప్రెస్ అయ్యాడట. ఆమె ఆ తర్వాత కూడా పలు సందర్బాల్లో నాగార్జునను కలవడం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో నాగ్ ముందు ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆమెకి మంచి అవకాశం ఇవ్వాలని నాగ్ భావిస్తున్నాడట. అందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక ప్రాజెక్ట్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ చర్చల సందర్బంగానే తాజాగా నాగార్జునను మరోసారి లహరి కలిసిందనే వార్తలు వస్తున్నాయి.

nagarjuna offers to lahari

nagarjuna offers to lahari

Nagarjuna : నాగ్ ఆఫ‌ర్ నిజ‌మేనా?

నాగార్జున ఏ విధంగా లహరిని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.. ఆమెతో ప్రాజెక్ట్ అంటే అది ఎలా ఉంటుందా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నాగ్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆరంభంలో బంగార్రాజు సినిమా విడుదల అయ్యింది. ఆ వెంటనే ది ఘోస్ట్ సినిమాను నాగ్ మొదలు పెట్టాడు. సినిమా కరోనా వల్ల కాస్త ఆలస్యంగా షూటింగ్ జరుగుతోంది. అతి త్వరలోనే సినిమా విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఆ మద్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ది ఘోస్ట్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌ల నాగ్ స‌రైన స‌క్సెస్ లు లేక బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది