Nagarjuna : ఆ సినిమా కోసం.. అంత కాలం వెయిట్ చేసిన నాగార్జున..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : ఆ సినిమా కోసం.. అంత కాలం వెయిట్ చేసిన నాగార్జున..!

 Authored By mallesh | The Telugu News | Updated on :20 December 2021,8:15 am

Nagarjuna : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో.. లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. నూతన దర్శకులతో సినిమాలు చేసి తనను తాను ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి సెపరేట్ చేసుకున్నాడని చెప్పొచ్చు. ఇకపోతే మన్మథుడిగా నాగార్జున ఎప్పుడూ అదే స్టైల్ మెయింటేన్ చేస్తుంటాడు. ఆరు పదుల వయసులో ఉన్నప్పటికీ యంగ్ హీరోయిన్స్‌తో యాక్ట్ చేస్తున్నాడు నాగార్జున. తనతో రొమాన్స్ చేసిన హీరోయిన్స్ తన కొడుకుతోనూ యాక్ట్ చేస్తున్నారు.

నాగార్జున తన సినిమాల్లో వైవిధ్యత ఉండేలా చూసుకుంటుంటాడు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని కథలను తన సినిమాల్లో చెప్తుంటాడు. ‘విక్రమ్’ ఫిల్మ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన తండ్రితో కలిసి పలు సినిమాలు చేశాడు. ప్రజెంట్ తన తనయులతోనూ సినిమాలు చేస్తున్నాడు. అయితే, నాగార్జున తన కెరీర్‌లో ఈ సినిమా కోసం ఆరు నెలల కాలం వేచి చూశాడట. ఆ సినిమా ఏదంటే.. ‘సంతోషం’. ఎవర్ గ్రీన్ పిక్చర్ ‘సంతోషం’ నాగార్జున కెరీర్ లోనే బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు.

Nagarjuna waited that much for period for that movie

Nagarjuna waited that much for period for that movie

Nagarjuna : ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన నాగార్జున..

ఈ సినిమా కథ వినిపించేందుకుగాను నాగార్జున వద్దకు డైరెక్టర్ దశరథ్ వచ్చి.. కేవలం 20 నిమిషాల చిన్నలైన్ చెప్పారట. దానికి ఇంప్రెస్ అయిన నాగార్జున ఓకే అని చెప్పాడు. అలా కంప్లీట్ స్టోరి రెడీ చేసుకుని రావాలని చెప్పారు నాగార్జున. అందుకు ఎంత టైం పడుతుందని దశరథ్‌ను అడగగా, ఆరు నెలల టైం పడుతుందని పేర్కొన్నాడట. అలా ఆ స్టోరి కోసం నాగార్జున సిక్స్ మంత్స్ వెయిట్ చేశాడు. అయితే, ఆయన వెయిటింగ్‌కుగాను ఫలితం దక్కింది. సక్సెస్ ఫుల్ మూవీ చేశాడు నాగార్జున. ఇందులో పాటలు కాని స్టోరి కాని, నటీనటుల నటన కాని ప్రేక్షకుల ఫేవరెట్ అని చెప్పొచ్చు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది