Nagarjuna : మాటలు జాగ్రత్త.. యాంకర్ రవికి నాగార్జున సీరియస్ వార్నింగ్.. ఏ విషయంలోనంటే?
Nagarjuna : బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు రవి. క్లాస్ యాంకర్‌గా ప్రదీప్ పేరు తెచ్చుకోగా, రవి మాస్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. యాంకరింగ్‌లో తనదైన స్టైల్ కోసం రవి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే తను పలు కార్యక్రమాల్లో ఫన్ జనరేట్ చేయడం కోసం డిఫరెంట్ పదాలను వాడుతుంటాడు. అలా వాడుతున్న క్రమంలో డబుల్ మీనింగ్స్ వచ్చే పదాలు, బూతులు వాడి అప్రతిష్ట పాలయ్యాడు రవి. ఈ క్రమంలోనే యాంకర్ రవిని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అక్కినేని నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారట.
ఇంతకీ ఆయన ఎప్పుడు ఈ వార్నింగ్ ఇచ్చారంటే..కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ సినిమాలో రకుల్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. చిత్రం కూడా ప్రేక్షకుల అంచనాను అందుకుందని చెప్పొచ్చు. కాగా, ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఈవెంట్‌లో సీనియర్ నటుడు చలపతిరావు టంగ్ స్లిప్ అయిన నేపథ్యంలో మహిళా సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే యాంకర్ రవిని స్టేజీ వెనక్కు పిలిచి మాటలు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని రవికి నాగార్జున వార్నింగ్ ఇచ్చారట.

nagarjuna warning in anchor ravi
Nagarjuna : ఆ సినిమా ఫంక్షన్‌లో రవి మాటలపై ఆగ్రహం..
ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌లో ‘అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు’ అని చలపతిరావు చేసిన కామెంట్స్‌పైన ప్రతీ ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, చలపతిరావు ఆ మాటలు మాట్లాడిన తర్వాత రవి ‘సూపర్’ అంటూ అనడంపైన కూడా మహిళా సంఘాలు మండిపడ్డాయి. అయితే, తనకు చలపతిరావు ఏం మాట్లాడారో వినబడలేదని, ఆయనేదో పంచ్ వేశారని అనుకున్నానని, ఆయన వివాదాస్పద కామెంట్ గురించి తనకు తెలియదని రవి తర్వాత వివరణ ఇచ్చాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మహిళా సంఘాల నేతలు చలపతిరావు, రవి వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.