Namrata Shirodkar : 20 ఏళ్ల మురారి.. నమ్రత ఎమోషనల్
Namrata Shirodkar : మహేష్ బాబు కెరీర్‌ను నిలబెట్టిన చిత్రం మురారి. నటుడిగా పది మెట్లు ఎక్కించిన సినిమా మురారి. కృష్ణవంశీ ఆలోచనల్లోంచి, విజన్ నుంచి జాలువారిన ఓ అద్భుత చిత్రం. సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఓ క్లాసిక్. మురారి సినిమాలోని సంగీతం, నటీనటులు, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్కటి ఎప్పటికీ నిలిచిపోతుంది. మురారి చిత్రం విడుదలై నేటికి 20 ఏళ్లు అవుతోంది. ఈ మూవీ గురించి చెబుతూ తాజాగా నమ్రత ఓ పోస్ట్ చేసింది.
Namrata Shirodkar : 20 ఏళ్ల మురారి.. నమ్రత ఎమోషనల్
మహేష్ బాబు నటించిన చిత్రాల్లోనాకు నచ్చిన వాటిలో మురారి ఒకటి. అది ఎప్పటికీ పాతపడదు. అందులో ఉన్న సరదా, అల్లరి, మ్యూజిక్ ఇవన్నీ కూడా వాటికవే సాటి. ఇప్పుడున్న రోజుల్లో అవి మీకు ఎక్కడా కనిపించవు. సోనాలి బింద్రేతో మహేష్ బాబుకు కుదిరిన కెమిస్ట్రీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు.. ప్రతీ ఒక్క విషయంలో మురారి నిజమైన క్లాసిక్ అంటూ నమ్రత చెప్పుకొచ్చింది. అయితే నమ్రత చెప్పిన ప్రతీ మాట కూడా నిజమే.
మురారి సినిమాను క్లాసిక్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మురారి పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం సైతం అంతే. ఎమోషన్స్, కామెడీ, చిలిపి సరదాలు ఇలా అన్ని కూడా యూనిక్‌గానే ఉంటాయి. పైగా ఈ మూవీ, అందులో చివరి పాట కోసం కృష్ణవంశీ ఏకంగా సూపర్ స్టార్ కృష్ణనే ఎదురించాడు. చివరి పాట కదా? ఏదైనా మాస్ సాంగ్ ఉంటే బాగుంటుందని అందరూ అన్నారట. కానీ కృష్ణవంశీ దానికి ససేమిరా ఒప్పుకోలేదట. అలా పెట్టిన అలనాటి రామచంద్రుడు అనే పాట ఇప్పటికి ఎప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో నిలిచే ఉంటుంది.