Namratha : నా కూతురు హ‌ద్దుల్లోనే ఉంటుంది.. న‌మ్ర‌త ఘాటు రిప్లై | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Namratha : నా కూతురు హ‌ద్దుల్లోనే ఉంటుంది.. న‌మ్ర‌త ఘాటు రిప్లై

 Authored By sandeep | The Telugu News | Updated on :22 April 2022,6:00 pm

Namratha: మ‌హేష్-న‌మ్ర‌త ఫ్యామిలీ ఎప్పుడు అంద‌రి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. వీరి పెళ్లి అయి ప‌దేళ్లు అవుతున్నా కూడా వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అంతేకాదు పిల్ల‌ల భ‌విష్య‌త్‌ని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇటీవ‌ల మ‌హేష్ కూతురు సితార సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ ప్ర‌మోష‌న్ సాంగ్‌లో క‌నిపించి అల‌రించింది. ఈ పాట వీడియోలో మహేశ్ బాబు కుమార్తె సితార వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట చిత్రం నుంచి వచ్చిన కళావతి పాటకు సితార రీల్స్ వీడియో చేసిందని,

ఆ వీడియోను సంగీత దర్శకుడు తమన్ కూడా చూడ‌గా, ఆ పాటలో సితార పెర్ఫార్మెన్స్ తమన్ ను ముగ్ధుడ్ని చేసిందని, దాంతో పెన్నీ సాంగ్ లో సితారను చూపిద్దామని ప్రతిపాదించాడని తెలిపారు సితార‌.అయితే మహేశ్, తాను భయపడ్డామని, ఓ సినిమా వీడియోలో డ్యాన్స్ చేయడం తనకు ఇదే తొలిసారి కావడంతో ఎలా చేస్తుందోనని కొంచెం ఆందోళనకు గురయ్యామని నమ్రత వివరించారు. అయితే, సితార డ్యాన్స్ స్టెప్పులు బాగుండి, వీడియో సరిగా వస్తేనే రిలీజ్ చేద్దామని ముందే అనుకున్నామని, ఒకవేళ వీడియో సరిగా రాకపోతే ఆ వీడియో క్యాన్సిల్ చేద్దామనుకున్నామని పేర్కొన్నారు. సితార ఏది చేయాల‌నిపిస్తే అది చేసేలా మ‌హేశ్-న‌మ్ర‌త స్వేచ్చ నిచ్చార‌ని ఈ స్టార్ కిడ్‌ను చూస్తే తెలిసిపోతుంది.

namratha says about sitara

namratha says about sitara

Namratha : సితార కంట్రోల్‌లోనే ఉంది..

చిన్న వ‌య‌స్సులో సితారకు వ‌స్తున్న‌ పాపులారిటీ, మీడియా అటెన్ష‌న్ ప‌ట్ల మ‌హేశ్ కానీ, న‌మ్ర‌త కానీ ఏమాత్రం భ‌య‌ప‌డ‌టం లేద‌ట‌. నేష‌న‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌మ్ర‌త మాట్లాడుతూ..సితార ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో అది చేసేలా మేము ఎంకరేజ్ చేస్తున్నామని నమ్రత తెలిపింది. ఆమెకు తొమ్మిది సంవత్సరాలు కావడం వల్ల ఆమెకు అంత స్వేచ్ఛ పెరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఈ వయసులో పిల్లలకు గైడెన్సీ ఈ బాగా అవసరమని కూడా చెప్పుకొచ్చింది. ఇది ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తను తెలుసుకొని లిమిట్స్ లో ముందుకు వెళుతుందని నమ్రత వెల్లడించింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది