ఎన్టీఆర్ జయంతి.. బాలయ్య ఎమోషనల్ పోస్ట్
Nandamuri Balakrishna : స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు ఆయన ఖ్యాతిని, కీర్తిని తలుచుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారు. వారి ప్రస్తావనే ప్రపంచాన్ని ప్రకంపింపజేస్తుంది.. వారి ఆలోచనలే అనంతమైన ఆనందాన్ని అనుభూతిలోకి తెస్తుంది.. వారి విజయగాథలు వేరొక లోకంలోకి వెంట తీసుకెళ్తాయి.

Nandamuri Balakrishna emotional Post On NTR 98th Birth Anniversary
అలాంటి అరుదైన కోవకి చెందిన మహానుభావుడు మన తారకరాముడు.. గల్లీల్లో తిరిగి పాలుపోసినవాడు ఢిల్లీకి దడ పుట్టించటం.. రంగులేసుకునేవాడు రాజ్యాలు ఏలటం.. గ్రీకుశిల్పంలాంటి రూపంతో పురాణ పాత్రల్లో జీవించటం.. అన్నా అన్నా అని ఆర్తిగా కోట్ల మందితో పిలిపించుకోవటం.. తరాలు మారుతున్నా తరగని కీర్తి ఆర్జించటం .. తోటరాముడుగా మొదలయ్యి కోట రాముడు గా ఎదగటం.. కలలోనే సాధ్యమయ్యే పనులని ఇలలో చేసి చూపించటం..ఒక్క తారకరాముడికే చెల్లింది..
ఆ చరిత్రకారుడు, యుగపురుషుడు శ్రీ నందమూరి తారకరాముని 98వ జయంతి రోజున వారి దివ్య స్మృతిలో అనుక్షణం వారిని స్మరిస్తూ.. మీ నందమూరి బాలకృష్ణ’ Nandamuri Balakrishna అని తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తన తాతను తలుచుకున్నారు. భారతరత్న ఇవ్వాలని చిరంజీవి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.