Mokshagna : ఆలూ లేదు సూలు లేదు… మోక్షజ్ఞ సినిమా బడ్జెట్ అన్నట్లుంది
Mokshagna : తెలుగులో ఆలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు ఈ సామెత నందమూరి అభిమానులకు బాగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నందమూరి అభిమానులు ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమా గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఒకవైపు మోక్షజ్ఞకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నా కూడా నందమూరి అభిమానులు మాత్రం మా మోక్షజ్ఞ బాబు సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ […]
Mokshagna : తెలుగులో ఆలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు ఈ సామెత నందమూరి అభిమానులకు బాగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నందమూరి అభిమానులు ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమా గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఒకవైపు మోక్షజ్ఞకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నా కూడా నందమూరి అభిమానులు మాత్రం మా మోక్షజ్ఞ బాబు సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ గొప్పలు పోతున్నారు.
నందమూరి బాలకృష్ణ దాదాపుగా 20 నుండి 30 కథలను విన్న తర్వాత ఒక కథను మా బాబు కోసం ఓకే చెప్పాడు అంటూ వారు చర్చించుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో మోక్షజ్ఞ మొదటి సినిమానే రూ. 100 కోట్ల బడ్జెట్ తో రూపొందించేలా నందమూరి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నాడని.. అందుకుగాను సమర్ధుడైన నిర్మాతను రంగంలోకి దించాలనే ఉద్దేశంతో చర్చలు జరుపుతున్నాడని అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇంకా కథే ఫైనల్ అవ్వలేదు.. దర్శకుడు ఎవరో తెలియదు.. అప్పుడే రూ. 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటూ ఎలా అనేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. అందుకే ఆలూ లేదు సూలు లేదు అన్న సామెతను చాలా మంది నందమూరి అభిమానులకు అన్వయించి కామెంట్స్ చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఒక భారీ సినిమా గానే అది ఉంటుంది అనే విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అది 100 కోట్ల సినిమానా లేదా అంతకు మించిన సినిమానా అనేది ఇప్పుడు క్లారిటీ లేదు. కనుక ముందస్తుగా ఎలాంటి ప్రకటనలు కానీ.. ఊహాగానాలు కానీ చేయడానికి లేదు. అందుకే ఆయన నుండి ప్రకటన వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే.