Nani : నాని కి తగిలిన ‘ వి ‘ దెబ్బ.. ఎలా ప్లాన్ చేసుకున్నాడో చూడండి..?
Nani : నాని కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన నేచరల్ పర్ఫార్మెన్స్ తో నాని నిర్మాతలకి లక్కీ హీరోగా మారాడు. నాని సినిమా రిలీజవుతుందంటే ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతారు. నిర్మాతలు బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ హిట్ సాధిస్తుందని ధీమాగా ఉంటారు. నాని సినిమాకమిటయ్యాడంటే కథ ఎలా ఉన్నా సినిమా రేంజ్ ని మార్చేస్తాడు. కథ లో ఉన్న క్యారెక్టర్ కి వందకి వంద శాతం న్యాయం చేస్తాడు. ముఖ్యంగా నాని సినిమాలకి పెద్ద ప్లస్ పాయింట్ అన్నీ వర్గాల ఆడియన్స్ అభిమానులుగా ఉండటం. అయితే నాని కి నిన్ను కోరి సినిమా తర్వాత మళ్ళీ గొప్ప సక్సస్ రాలేదనే చెప్పాలి.

Nani how nani planned after V movie effect
జెర్సీ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాని రావాల్సిన సక్సస్ రాలేదు. ఇక గ్యాంగ్ లీడర్ సినిమాతో మంచి ప్రయోగమే చేశాడు. కాని అది కూడా వర్కౌట్ కాలేదు. ఇక నాని నటించిన గత చిత్రం వి నాని కి బ్రేక్ ఇస్తుందనుకుంటే వికటించింది. నాని పర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి గాని సినిమా సూపర్ హిట్ అన్న టాక్ రాలేదు. అయితే నిర్మాత దిల్ రాజు కి మాత్రం 10 కోట్లు పైనే లాభాలు వచ్చాయని చెప్పుకున్నారు. ఇదే నాని మార్కెట్ స్టామినా. ఓటీటీలో రిలీజైన వి సినిమాకి కూడా 10 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. అదే థియేటర్స్ లో రిలీజైతే ఎలా ఉండేదో.
Nani : నాని వరసగా సినిమాలని ప్రకటించి క్లారిటీ ఇచ్చాడు.
అయితే నాని మీద వి సినిమా ప్రభావం పడిందని అనుకున్నారు. కాని అది కేవలం రూమర్స్ అని నాని వరసగా సినిమాలని ప్రకటించి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు వరసగా సినిమాలని రిలీజ్ చేసేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు సినిమాల అప్‌డేట్ ఇవ్వబోతున్నాడు నాని. శ్యాం సింగ్ రాయ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే టక్ జగదీష్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నాడు నాని. ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇవ్వనున్నాడు. ఇక అంటే సుందరానికి అన్న సినిమా ని కూడా త్వరలో సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడు నేచురల్ స్టార్.