Naresh – Pavitra Lokesh : మనోజ్ రెండో పెళ్లికీ నరేష్ తో నయా లుక్ లో ఎంట్రీ ఇచ్చిన పవిత్ర లోకేష్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naresh – Pavitra Lokesh : మనోజ్ రెండో పెళ్లికీ నరేష్ తో నయా లుక్ లో ఎంట్రీ ఇచ్చిన పవిత్ర లోకేష్ వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :5 March 2023,9:40 am

Naresh – Pavitra Lokesh : హైదరాబాద్ ఫిలింనగర్ లో మంచు లక్ష్మీ నివాసంలో గత రాత్రి 8:30 గంటలకు మంచు మనోజ్.. భూమా మౌనికకీ మూడు ముళ్ళు వేసి రెండో పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఇదే సమయంలో ఈ వివాహ వేడుకకు పవిత్ర లోకేష్ తో నరేష్ కూడా రావడం జరిగింది. సరిగ్గా డిసెంబర్ 31 వ తారీకు నాడు.. పవిత్ర లోకేష్ నీ పెళ్లి చేసుకోబోతున్నట్లు నరేష్ తెలియజేయడం జరిగింది.

Naresh and Pavitra Lokesh Visuals At Manchu Manoj and Bhuma Mounika Reddy Marriage

Naresh and Pavitra Lokesh Visuals At Manchu Manoj and Bhuma Mounika Reddy Marriage

ఆ తర్వాత నరేష్ తన మొదటి భార్య విషయంలో చట్టపరంగా కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. ఇటీవల నరేష్ ఇంటి వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు… దాడి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే మంచు మనోజ్ రెండో పెళ్లి వివాహ కార్యక్రమానికి పవిత్ర లోకేష్ కొత్త లుక్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పూర్తిగా హెయిర్ స్టైల్ మార్చి… బేబీ కటింగ్ తో నరేష్ తో కలిసి రావటం జరిగింది.

Naresh and Pavitra Lokesh Exclusive Visuals @ Manchu Manoj and Bhuma  Mounika Reddy Marriage - YouTube

ఇక నరేష్ కూడా కొత్త తరహా గ్యాప్ లో దర్శనమిచ్చారు. గత కొంతకాలంగా వీరిద్దరిపై ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తప్పుగా వ్యవహరించిన కొన్ని వెబ్ మీడియా ఛానల్స్ విషయంలో నరేష్ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా రెడీ అయ్యారు. ఈ క్రమంలో కొత్త లుక్ లో ఈ జంట మనోజ్ పెళ్లికి రావడం సంచలనంగా మారింది. పవిత్ర లోకేష్ కొత్త స్టైల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది