Navya Swamy : బీచ్‌లో నవ్య స్వామి హల్చల్.. థాయ్‌లాండ్‌లో అందాల జాతర | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Navya Swamy : బీచ్‌లో నవ్య స్వామి హల్చల్.. థాయ్‌లాండ్‌లో అందాల జాతర

 Authored By prabhas | The Telugu News | Updated on :2 June 2022,12:30 pm

Navya Swamy : బుల్లితెరపై నవ్యస్వామి అందాలకు అందరూ ఫిదా అవుతుంటారు. ఒకప్పుడు నవ్యస్వామి అంటే బుల్లితెరపై అంత క్రేజ్ ఉండేది. ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్స్‌లో నటిస్తూ వచ్చింది. కానీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఆమె కథ అనే సీరియల్‌లో నవ్యస్వామి, రవికృష్ణతో కలిసి నటించింది. ఇక ఈ ఇద్దరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ వల్లే ఇంత ఫేమస్ అయింది. ఇక ఇద్దరికీ కరోనా సోకడం, అది కూడా తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మొదటి సారిగా నవ్యస్వామికే కరోనా సోకడంతో మరింతగా వార్తల్లోకి ఎక్కింది. కరోనా సోకడం అంటే మహాపాపంగా చూసిన ఆ రోజుల్లో నవ్యస్వామికి నరకం చూపించేశారు.

అలా రవికృష్ణకు కూడా కరోనా సోకింది. మొత్తానికి కరోనా నుంచి బయటపడింది. అయితే పలుమార్లు టెస్టులు చేయించుకున్నా కూడా పాజిటివి పాజిటివ్ అని వస్తూనే ఉందట. అలా పదిహేను రోజులు నరకం చూశానని, చివరకు కరోనా నెగెటివ్ అని రావడంతో ఊపిరి పీల్చుకున్నానంటూ నవ్యస్వామి చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు నవ్య స్వామి మాత్రం ఫుల్ చిల్ అవుతోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. మామూలుగా వీకెండ్ వస్తే తన ఫ్రెండ్స్ హరితేజ, కస్తూరీ సీరియల్ ఐశ్వర్యలతో కలిసి హల్చల్ చేస్తుంటుంది.

Navya Swamy Enjoys at thailand beach

Navya Swamy Enjoys at thailand beach

హరితేజ భర్త దీపక్ రావు కన్నడిగుడు కావడంతో మరింత క్లోజ్ అయ్యామంటూ నవ్యస్వామి చెబుతుంటుంది. అయితే ఈ మూడు ఫ్యామిలీలు వీకెండ్‌లో నానా హంగామా చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ మూడు ఫ్యామిలీలు థాయ్‌లాండ్ చెక్కేశాయి. గత వీకెండ్‌లోనే అక్కడికి జంప్ అయినట్టున్నారు. మొత్తానికి థాయ్ లాండ్‌లో నవ్యస్వామి అందాల విందు చేస్తోన్నట్టుంది. తెరపై ఎప్పుడూ కూడా నవ్యస్వామి అందాలను ఆరబోయలేదు. పద్దతిగానే ఉంటుంది. కానీ నవ్యస్వామి మాత్రం ఇప్పుడు థాయ్‌లాండ్‌లో దుమ్ములేపుతోంది. అందాల ప్రదర్శనకు తెర లేపింది. బీచ్‌లో నవ్య స్వామి పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది