Nayanthara : వార్నీ.. నయనతారను కూడా వదల్లేదా? ఆ డైరెక్టర్ నయనతారను ఏం చేశాడంటే?
Nayanthara : నయనతార తెలుసు కదా. లేడీ సూపర్ స్టార్. ఒక స్టార్ హీరోకు కూడా లేనంత ఫాలోయింగ్, క్రేజ్, పాపులారిటీ తనకు ఉంది. తను హీరోయిన్ గా ఏదైనా సినిమాల్లో నటించాలంటే మామూలు విషయం కాదు. తను కోట్ల పారితోషికం అడుగుతుంది. అందుకే తనను సినిమాల్లో తీసుకోవాలంటే డైరెక్టర్లు భయపడతారు. కానీ.. తనకు ఉన్న క్రేజ్ తో ఎంతైనా ఇచ్చి తీసుకోవడానికి కొందరు డైరెక్టర్లు రెడీగా ఉంటారు. లేడీ సూపర్ స్టార్ ఈ మధ్య హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే.. కాస్టింగ్ కౌచ్ గురించి నయనతార తాజాగా వ్యాఖ్యానించింది.
అసలు నయనతార లాంటి స్టార్ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం సినీ ప్రేమికులను షాక్ నకు గురి చేసింది. ఎందుకంటే.. తను స్టార్ హీరోయిన్. తను ఇండస్ట్రీకి వచ్చే 20 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు తన రేంజ్ కూడా వేరు. కానీ.. తను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలే అని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తమిళ్ మూవీలో కీలకమైన పాత్రలో నటించేందుకు.. నయనతారను ఓ డైరెక్టర్ కమిట్ మెంట్ అడిగాడట. ఇది చాలా మంచి పాత్ర. ఈ పాత్ర చేస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. అని ఆ డైరెక్టర్ నయనతారకు చెప్పాడట.
Nayanthara : తమిళ్ మూవీలో ఓ పాత్ర కోసం డైరెక్టర్ కమిట్ మెంట్ అడిగాడట
దీంతో ముఖం మీదే నాకు ఈ ఆఫర్ వద్దు అంటూ డైరెక్టర్ కు చెప్పేసిందట. తాను స్కిల్స్, టాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చా కానీ.. ఇలా కమిట్ మెంట్స్ ఇవ్వడానికి కాదు అంటూ ఖరాఖండిగా చెప్పేసిందట. తను చెప్పినట్టుగానే నిజంగానే నయనతార టాలెంటెడ్ కదా. ఒకవేళ మనం ఇండస్ట్రీలో కమిట్ మెంట్ కు ఒప్పుకున్నామంటే.. మనకు టాలెంట్ లేదని ఒప్పుకున్నట్టే అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నయనతార. కమిట్ మెంట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది మన చేతుల్లో పని. కానీ.. మనం ఏ దారి ఎంచుకుంటాం అనే దాని మీదనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది నయనతార.