Nayanthara : ఆ స్టార్ హీరో పెద్ద వేస్ట్ గాడు .. అందుకే ఆ సినిమా రిజెక్ట్ చేసా ..! నయనతార షాకింగ్ కామెంట్స్ !!
Nayanthara : ఇండస్ట్రీలో కాస్టింగ్ కచ్ అనేది చాలా కామన్ అయిపోయింది. చాలామంది ఆర్టిస్టులు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని పలు మీడియాలలో చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అయితే చిన్న హీరోయిన్లు ఈ విషయంపై స్పందించారు. కానీ స్టార్ హీరోయిన్స్ మాత్రం ఈ విషయం గురించి కాస్త ఆలోచించి మాట్లాడుతుంటారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ లు ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి ఇండస్ట్రీకి వచ్చినవాళ్లే. ఇక ఇదే విషయంపై సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార స్పందించారు. ఆమె కూడా ఇలాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వచ్చిందట.
నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల సరోగసి ద్వారా పిల్లలను కూడా కన్నది. అయినా ఆమెకు సినీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్ తన కెరీర్ ఆరంభంలో కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది. నయన్ మాట్లాడుతూ పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చిందని, అయితే మేకర్స్ కొన్ని కండిషన్స్ పెట్టారు. వాటికి తగ్గట్టుగా నడుచుకోవాలని ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలని కండిషన్లు పెట్టారని చెప్పుకొచ్చింది.

Nayanthara comments about star hero
అయితే వాళ్లు పెట్టిన కండిషన్ నచ్చకపోవడంతో అంత పెద్ద సినిమా అయినా రిజెక్ట్ చేశానని నయనతార తెలిపింది. ఇదే విషయాన్ని నయన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. అయితే ఆ పెద్ద సినిమా ఏంటనేది, స్టార్ హీరో ఎవరనే విషయాన్ని నయనతార బయటికి చెప్పలేదు. ఇక నయనతార టాలీవుడ్ లో ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది. ఇక త్వరలోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది నయన్. అక్కడ కూడా తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించగలరని అభిమానులు అంటున్నారు.