Samantha : సమంతకు నయనతార కాస్ట్ లీ గిఫ్ట్.. నయన్ ప్రేమకు సమంత ఫిదా
Samantha : ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే చోట ఉంటే ఏవో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇద్దరూ ఇగోలకు పోవడం, సెట్‌లో అలకలు, అశాంత వాతావరణ ఉంటుంది. అయితే సమంత, నయనతార మాత్రం చాలా ఫ్రెండ్లీగా మారిపోయారు. ప్రస్తుతం ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఈ ఇద్దరూ ఇలా కలవడానికి కారణం మాత్రం నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివనే.
కాథువాక్కుల రెండు కాదల్ అనే సినిమాతో నయనతార, సమంత,విజయ్ సేతుపతిలను ఒక దగ్గరకు తీసుకొచ్చాడు విఘ్నేశ్ శివన్. అయితే ఇందులో నటించిన సమయంలోనే సమంత, నయన్ మధ్య స్నేహం ఏర్పడినట్టుంది. ఈ ఇద్దరూ ఎంత క్లోజ్‌గా మారారో అప్పుడు విఘ్నేశ్ షేర్ చేసే ఫోటోల ద్వారా తెలుస్తుంది.

Nayanthara Diamond Gift To Samantha
Samantha : సమంత కోసం డైమండ్ గిఫ్ట్..
ఈ చిత్రంలో ఖతిజా పాత్రలో సమంత.. కణ్మణి పాత్రలో నయన్ నటిస్తోంది. అయితే ఖతిజా కోసం కణ్మణి కాస్ట్ లీ గిఫ్ట్ కొనేసింది. డైమండ్ రింగులో, చెవి రింగులో కొనేసింది. మొత్తానికి సమంత,నయన్ మధ్య ఉన్న స్నేహానికి ఇదో నిదర్శనంలా మారింది. నయన్ పంపించిన ఈ గిఫ్టులను సమంత చూసి మురిసిపోతోంది. థ్యాంక్యూ డార్లింగ్ నయన్ అని సమంత చెప్పుకొచ్చింది.