Nayanthara : అరె… అచ్చం న‌య‌న‌తార మాదిరిగానే ఉన్న ఈ బ్యూటీ ఎవ‌రు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nayanthara : అరె… అచ్చం న‌య‌న‌తార మాదిరిగానే ఉన్న ఈ బ్యూటీ ఎవ‌రు..!

Nayanthara : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు,త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది ఈ బ్యూటీ. జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా అడ‌గుపెట్టింది. నాలుగు ప‌దుల వ‌య‌స్సులోను అంతే గ్లామ‌ర్ మెయింటైన్ చేస్తూ వ‌రుస సినిమా అవ‌కాశాల‌ని ద‌క్కించుకుంటుంది. కొన్ని నెల‌ల క్రితం విఘ్నేష్ శివ‌న్ ని పెళ్లి చేసుకొని స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా, ఫ్యామిలీ ప‌రంగా సంతోషంగానే ఉంది […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Nayanthara : అరె... అచ్చం న‌య‌న‌తార మాదిరిగానే ఉన్న ఈ బ్యూటీ ఎవ‌రు..!

Nayanthara : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు,త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది ఈ బ్యూటీ. జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా అడ‌గుపెట్టింది. నాలుగు ప‌దుల వ‌య‌స్సులోను అంతే గ్లామ‌ర్ మెయింటైన్ చేస్తూ వ‌రుస సినిమా అవ‌కాశాల‌ని ద‌క్కించుకుంటుంది. కొన్ని నెల‌ల క్రితం విఘ్నేష్ శివ‌న్ ని పెళ్లి చేసుకొని స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా, ఫ్యామిలీ ప‌రంగా సంతోషంగానే ఉంది న‌య‌న‌తార‌. అయితే ఈ అమ్మ‌డిని పోలిన మ‌రో భామ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఆమెని చూసిన వారంద‌రు అవాక్క‌వుతున్నారు.

సాధారణంగా మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మ‌నం వింటూ ఉంటాం. సోష‌ల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక ఒక‌రిని పోలిన మ‌రొక‌రికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంటాయి. ఈ క్ర‌మంలో ఓకే విధమైన పోలికలు ఉన్నవారు ఇట్టే క‌లిసిపోతున్నారు. దివంగత హీరోయిన్ సౌందర్య పోలికలతో ఉన్న అమ్మాయికి సంబంధించిన ఫొటోలు కొన్ని నెల‌ల క్రితం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. అలాగే దివంగత నటి సిల్క్ స్మిత పోలికలతో ఉన్న అమ్మాయికి సంబంధించిన ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతారను జిరాక్స్ తీసినట్లుగా ఓ అమ్మాయి క‌నిపించింది.

Nayanthara అరె అచ్చం న‌య‌న‌తార మాదిరిగానే ఉన్న ఈ బ్యూటీ ఎవ‌రు

Nayanthara : అరె… అచ్చం న‌య‌న‌తార మాదిరిగానే ఉన్న ఈ బ్యూటీ ఎవ‌రు..!

అచ్చం న‌య‌న‌తార మాదిరిగానే ఉన్న ఈ అమ్మాయిని చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. ఆమె గురించి ఆరాలు తీస్తున్నారు. అయితే ఆ అమ్మాయి పేరు సజినీకృష్ణ కాగా, ఇటీవల ఈ అమ్మాయి వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒడిపోలమా సినిమాలోని ఓ పాటకు లిప్ సింక్ చేస్తూ వీడియోని షేర్ చేసింది. ఇందులో పాట‌కి త‌గ్గ‌ట్టుగా ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ న‌య‌న‌తార‌ని గుర్తు చేశాయి. ఆమె వీడియోస్ అన్నింటిలో కూఆ న‌య‌న‌తార మాదిరిగానే ఉంది. కొంప‌దీసి ఆమె న‌య‌న‌తార ట్విన్సా ఏంటని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి న‌య‌న‌తార డూప్‌కి భ‌లే క్రేజ్ వ‌చ్చేసింది. ఇక న‌య‌న‌తార విష‌యానికి వ‌స్తే చివరిసారిగా అన్నపూర్ణి చిత్రంలో కనిపించింది. ఇప్పుడు డియర్ స్టూడెంట్స్, పట్టు, విక్కీ 6, టెస్ట్, థని ఒరువన్ 2 వంటి చిత్రాల్లో న‌టిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది