Nayanthara : అసలు నిజం తెలిసిపోయింది.. నయనతార సరోగసీ కేసులో అడ్డంగా దొరికిన డాక్టర్? అందరూ అరస్ట్?
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి తనకు కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల తాము కవలలకు జన్మనిచ్చామని నయన్ దంపతులు సోషల్ మీడియా వేదికగా చెప్పిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పెళ్లయి 4 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఎలా నయనతార కవలలకు జన్మనిచ్చిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో తాము సరోగసీ ద్వారా పిల్లలను కన్నామని నయన్, విఘ్నేశ్ వెల్లడించారు. దీంతో సరోగసీ అనేది ఇండియాలో చట్టబద్ధం కాదని, కొన్ని అనివార్య కారణాలు తప్పితే మిగితా సమయాల్లో సరోగసీని వాడొద్దని భారత చట్టాలు చెబుతున్నాయి.
దీంతో నయన్ దంపతులు అడ్డంగా బుక్కయిపోయారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఆరోగ్యశాఖ మంత్రికి ఈ ఘటనకు సంబంధించి విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం కమిటీ వేశారు. ఆ కమిటీ నయనతార సరోగసీ విషయంపై దర్యాప్తు చేపడుతోంది. దీంతో సరోగసీ ప్రక్రియను నిర్వహించిన ఆసుపత్రిని కమిటీ గుర్తించింది. వెంటనే అధికారులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే కమిటీ నయన్ దంపతులను కూడా పిలిచి విచారించనున్నారు. చెన్నైలోని ఓ ఆసుపత్రి అది.

Nayanthara is doctor who was caught in the crossfire in the surrogacy case
Nayanthara : చెన్నైలోని ఓ ఆసుపత్రి అది
ఆ ఆసుపత్రిలోనే నయన్, విఘ్నేశ్ దంపతులు సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. సరోగసీకి ఒప్పుకున్న మహిళ కూడా ఎవరో కాదు.. నయనతార కాలేజీ ఫ్రెండ్ అని తెలుస్తోంది. ఆమె ఫ్రెండ్ మాత్రమే కాదు.. బంధువు కూడా అని అంటున్నారు. ఆమె దుబాయ్ లో ఉంటుందని, బిజినెస్ చేస్తుందని తెలుస్తోంది. అయితే.. తమకు ఆరేళ్ల క్రితమే వివాహం అయిందని, నయన్ కు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పే ఒక అఫిడవిట్ ను నయన్.. తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. సరోగసి నిబంధనల ప్రకారం.. పెళ్లి అయి అయిదేళ్లు అయినా పిల్లలు కలగకపోవడంతో సరోగసి ప్రక్రియ ద్వారా పిల్లలను కన్నామని అందులో నయన్ స్పష్టం చేసింది.