JR NTR – Nayanthara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోస్యాన్ని నిజం చేసిన నయనతార..!
JR NTR – Nayanthara : టాలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార దంపతులకు కవలలు పుట్టారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. తన భర్త విఘ్నేశ్ శివన్ ఈ సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. క్షణాల్లోనే ఈ న్యూస్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పటికి ఒక విషయం మాత్రం జనాలకు అర్థం కావడం లేదు. గర్బం దాల్చకుండా తల్లి కావడం ఎంతవరకు కరెక్ట్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ నాలుగు నెలల కిందట వివాహం చేసుకున్నారు. కానీ వీరిరువురు చాలా కాలంగా లవ్ లో ఉన్నారట..
ఇదే విషయంపై అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. నయన్ గతంలో ఇద్దరు ముగ్గురితో ఎఫైర్ నడిపి మధ్యలో సైడ్ అయిపోయింది. విఘ్నేశ్‌తో కూడా ఇలాగే చేస్తుందని అంతా భావించారు. కానీ చివరకు వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో ఆ రూమర్లకు చెక్ పడింది. నాలుగు నెలల కిందట వీరికి వివాహం జరిగితే తాజాగా ఈ జంటకు కవల పిల్లలు పుట్టారని నయన్ భర్త పెట్టిన పోస్టిన అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే, ఈ కవలలకు నయన్ నేరుగా జన్మనివ్వలేదని స్పష్టమైంది. సరోగసీ ద్వారా ఈ దంపతులు వారికి పేరెంట్స్ అయ్యారు. ఈ విషయం తెలిసి కొందరు నయన్ దంపతులను తప్పుబడుతున్నారు.

Nayanthara made the Prophecy of JR NTR come true
JR NTR – Nayanthara : మచ్చ శాస్త్రం ప్రకారమేనా..
నయన్ దంపతులకు ఏమంత ఏజ్ అయ్యింది. మీరు ఏమైనా ముసలి వారా? లేదా నయనతారకు పిల్లలు పుట్టరని.. లేక గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా..? ఎందుకు సరోగసి ద్వారా పిల్లలను కనాల్సి వచ్చింది. ఒకవేళ పిల్లలను కనిపెంచితే గ్లామర్ దెబ్బతిని సినిమా అవకాశాలు రావని నయన్ ఇలా చేసిందా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోస్యాన్ని నయన్ నిజం చేసిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అదుర్స్ సినిమాలో మచ్చ శాస్త్రం ప్రకారం నడుము మీద పుట్టుమచ్చ ఉంటే కవలలు పుడతారని ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్బానికి ఆపాదిస్తున్నారు.
#Nayanthara & #vignesh Blessed With Twin Sons ????
congratulations to this beautiful family ❤️ pic.twitter.com/EGTjnXSsqa
— Milagro Movies (@MilagroMovies) October 9, 2022