Nayanthara : అక్కడ ప్లాస్టిక్ సర్జరీ… క్లారిటీ ఇచ్చిన నయనతార ..!
Nayanthara : కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన ఫాం కొనసాగిస్తున్న నయనతార సౌత్ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో సత్తా చాటుతుంది. ఐతే నయనతార మొన్నటిదాకా కేవలం తెలుగు, తమిళ సినిమాలతో సరిపెట్టుకోగా లాస్ట్ ఇయర్ జవాన్ తో బాలీవుడ్ కి వెళ్లింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఐతే తమిళ్ లో దాదాపు నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా ఉంది నయనతార. అందుకే హిందీ సినిమాలకు సారీ […]
ప్రధానాంశాలు:
Nayanthara : అక్కడ ప్లాస్టిక్ సర్జరీ... క్లారిటీ ఇచ్చిన నయనతార ..!
Nayanthara : కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన ఫాం కొనసాగిస్తున్న నయనతార సౌత్ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో సత్తా చాటుతుంది. ఐతే నయనతార మొన్నటిదాకా కేవలం తెలుగు, తమిళ సినిమాలతో సరిపెట్టుకోగా లాస్ట్ ఇయర్ జవాన్ తో బాలీవుడ్ కి వెళ్లింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఐతే తమిళ్ లో దాదాపు నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా ఉంది నయనతార. అందుకే హిందీ సినిమాలకు సారీ చెప్పక తప్పట్లేదని అంటుంది. ఇక ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార తనపై వచ్చిన ప్లసటిక్ సర్జరీ కామెంట్స్ కి ఆన్సర్ ఇచ్చింది. తను ఎక్కడ ఎప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించలేదని చెప్పింది. తన ఫేస్ లో కొన్నిసార్లు మార్పులు కేవలం కను బొమ్మలు సెట్ చేసుకున్నప్పుడు అలా కనిపిస్తాయని అన్నది.
Nayanthara పాత్రల స్వభావానికి తగినట్టుగా డైటింగ్..
కనుబొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్ గా సెట్ చేసుకున్నప్పుడు ఫేస్ లో కొంత మార్పు వస్తుంది. అయినంత మాత్రాన అది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు కాదని క్లారిటీ ఇచ్చింది నయనతార. అంతేకాదు తన ఫేస్ అంటే తనకు చాలా ఇష్టమని తను ఎలా ఉన్నానో అలా ఉంటాయనని. ఐతే కొన్నిసార్లు పాత్రల స్వభావానికి తగినట్టుగా డైటింగ్ చేస్తా.. కొన్నిసార్లు బాగా తింటా.. సో బుగ్గలు కూడా ఒక్కోసారి పైకి ఒక్కోసారి లోపలకి ఉంటాయి. అందుకే తన మీద ప్లాస్టిక్ సర్జరీ కామెంట్స్ చేస్తుంటారని అన్నది నయనతార. అంతగా డౌట్ ఉంటే వచ్చి నా బుగ్గ గిల్లి చూడండి ఎక్కడ ప్లాసిటిక్ ఉండదని చెప్పింది నయనతార.
గిల్లి చూడండి.. గిచ్చి చూడండి అని అంత డేర్ గా చెబుతుంది అంటే కచ్చితంగా నయనతార ప్లాసిటిక్ సర్జరీ న్యూస్ రూమరే అని చెప్పొచ్చు. ఐతే అమ్మడు మాత్రం తన ఫేస్ లో మార్పులకు కారణం కనుబొమ్మలు ఇంకా పాత్రల కోసం తను తీసుకునే డైట్ కారణమని పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా నయన్ క్లారిటీతో ఆమెపై గాసిప్ చేసే వాళ్లకి షాక్ తగిలినట్టు అయ్యింది.