Nayanthara : ”నా పడక గదిలో జరిగిన ఆ సంఘటన – తెలుగు టాప్ డైరెక్టర్ కి మొత్తం తెలుసు’ నయనతార సంచలన కామెంట్స్…!
Nayanthara : నయనతారను అందరూ లేడీ సూపర్ స్టార్ లేదా సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అంటారు. నిజానికి.. తనకు ఉన్న క్రేజ్ అటువంటిది. ఒక స్టార్ హీరోకు కూడా లేని క్రేజ్ నయనతార సొంతం. సౌత్ ఇండియాలోనే తను టాప్ హీరోయిన్. ఒక స్టార్ హీరోకు కూడా లేని పారితోషికం తనకు వస్తుంది అంటే అది మామూలు విషయం కాదు. తనది సౌత్ ఇండియా మొత్తంలో ఈ ఇండస్ట్రీ తీసుకున్నా టాప్ తనే. సౌత్ లోనే క్రేజియెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పెళ్లి అయిన నాలుగు నెలలకే తను ఇద్దరు కవల పిల్లలకు జన్మ కూడా ఇచ్చింది.అయితే.. తను సరోగసీ పద్ధతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. నిజానికి నయనతార పర్సనల్ లైఫ్ ఎప్పుడూ చిక్కులే. తన లైఫ్ ఇప్పుడే కాదు.. తన కెరీర్ బిగినింగ్ నుంచి మిస్టరీనే. తన పెళ్లి విషయంలోనే అదే జరిగింది. ఆ తర్వాత తన సరోగసీ కూడా అంతే చర్చకు దారి తీసింది. దాని మీద తమిళనాడు ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా ఎలా పిల్లలను కంటారంటూ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇటీవల యాంకర్ సుమతో ఎక్స్ క్లూజివ్ గా నయనతార ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Nayanthara : యాంకర్ సుమ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార
ఈ సందర్భంగా అదుర్స్ సినిమాలో నయనతారకు కవలలు పుడతారు అంటూ ఎన్టీఆర్ అన్న విషయాన్ని ఇటీవల నెటిజన్లు మీమ్స్ గా చేసి నయనతారను ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. దాని గురించే ఆ మీమ్ ను చూపిస్తూ సుమ నయనతారను అడుగుతుంది. నాకు కవల పిల్లలు పుడుతారని ఆ డైరెక్టర్, ఎన్టీఆర్ కు ముందే తెలుసేమో అన్నట్టుగా క్యూట్ గా సమాధానం చెబుతుంది నయనతార. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.