Unstoppable Promo : పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్”.. ఫస్ట్ పార్ట్ ప్రోమో రిలీజ్.. డేట్ కూడా చెప్పేశారు..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 27 January 2023, 7:56 pm

Unstoppable Promo : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్అన్ స్టాపబుల్” షో ప్రోమో రిలీజ్ అయింది. మొదటి భాగం ప్రోమో అంటూ..ఆహా టీం కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. రెండు పార్ట్ లుగా స్త్రిమింగ్ చేస్తున్నారు. దీంతో బాలయ్య..పవన్ ఎపిసోడ్ మొదటి పార్ట్ లో వేసిన పలు ప్రశ్నలు కూడా చూపించడం జరిగింది.

NBK X PSPK Part 1 Unstoppable Promo Release

NBK X PSPK Part 1 Unstoppable Promo Release

గుడుంబా శంకర్ సినిమా గురించి ఇంకా తనతో పవన్ ఫస్ట్ మీట్ అయినా దాని గురించి.., మూడు పెళ్లిళ్లు గురించి పవన్ నీ బాలకృష్ణ ప్రశ్నించారు. ఇంకా రామ్ చరణ్ తో మరోసారి ఫోన్ లో బాలయ్య మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ తో బాండింగ్ గురించి కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలో మధ్యలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ రావడం జరిగింది.

NBK X PSPK Part 1 Unstoppable Promo Release

NBK X PSPK Part 1 Unstoppable Promo Release

పంచ కట్టుకుని రావటంతో పెళ్లిచూపులుకు వచ్చావా.. అని బాలకృష్ణ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ కొద్దిగా సిగ్గుపడటం జరిగింది. సినిమా పరంగా ఇంకా కుటుంబం గురించి రాజకీయం గురించి బాలయ్య చాలా లోతైన ప్రశ్నలు పవన్ నీ అడిగినట్లు ఈ ప్రోమోలో చూపించారు. ఇదే టైములో ఫిబ్రవరి మూడవ తారీకు పవన్ మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఆహా టీం ప్రోమోలో తెలియజేయడం జరిగింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp