Renu Desai : మళ్లీ ప్రేమలో పడ్డ రేణు దేశాయ్.. ఈసారి ఎవరితో అంటే..?? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Renu Desai : మళ్లీ ప్రేమలో పడ్డ రేణు దేశాయ్.. ఈసారి ఎవరితో అంటే..??

Renu Desai : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో ఆయన మాజీ భార్య, హీరోయిన్ అయినా రేణు దేశాయ్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. ఈమె తెలుగులో చేసినవి రెండు సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం స్టార్ సెలబ్రిటీనే. ఇక ‘ బద్రి ‘ సినిమాతో అయితే ఈమెకు ఓవర్ నైట్ లో స్టార్ డం వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న తర్వాత […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 December 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Renu Desai : మళ్లీ ప్రేమలో పడ్డ రేణు దేశాయ్.. ఈసారి ఎవరితో అంటే..??

Renu Desai : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో ఆయన మాజీ భార్య, హీరోయిన్ అయినా రేణు దేశాయ్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. ఈమె తెలుగులో చేసినవి రెండు సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం స్టార్ సెలబ్రిటీనే. ఇక ‘ బద్రి ‘ సినిమాతో అయితే ఈమెకు ఓవర్ నైట్ లో స్టార్ డం వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న తర్వాత స్టార్ డం మరింతగా పెరిగింది. ఇక ప్రస్తుతం రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో సెటిల్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రేణు దేశాయ్ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన పిల్లలు ఆద్య, అకిరా నందన్ ల గురించి ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. ఇటీవల రేణు దేశాయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.

అంతేకాకుండా రవితేజ నటించిన ‘వటైగర్ నాగేశ్వరరావు ‘వసినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రేణు దేశానికి మంచి మార్కులే పడ్డాయి. సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ రేణు దేశాయ్ కి మాత్రం మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకోవాలి. చాలాకాలం తర్వాత వెండి తెరపై రేణు దేశాయ్ కనిపించడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె మళ్ళీ ప్రేమలో పడ్డట్లు ఈ పోస్ట్ ద్వారా తెలుస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన యానిమల్ సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. అయితే ఈ సినిమాపై రేణు దేశాయ్ స్పందించారు. తాను ఎట్టకేలకు సినిమా చూశానని ఆ సినిమాతో ప్రేమలో పడినట్లు తెలిపారు. తండ్రీ కొడుకుల మధ్య ప్రేమాభిమానాలను తెరపై కళ్ళకు కట్టినట్లుగా డైరెక్టర్ చూపించారు అన్నారు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయని ఆమె పేర్కొన్నారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు, ఆ ప్రేమ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని, ఈ అనుభూతిని ప్రతి ఒక్కరూ పొందాలనుకుంటే థియేటర్లో సినిమా చూడాలని, ఈ సినిమాను మిస్ కావద్దంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. దీంతో రేణు దేశాయ్ యానిమల్ సినిమాతో ప్రేమలో పడ్డారని చివరికి తెలిసింది.

 

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక