Pawan Kalyan : పేరు తెలీదు అన్నోడితో పడిగాపులు కాసేలా చేసిన పవన్ కళ్యాణ్.. మంట పెడుతున్న మెగా ఫ్యాన్స్
Pawan Kalyan : బాలకృష్ణ హోస్ట్‌గా సాగుతున్న అన్‌స్టాపబుల్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. గత సీజన్ మహేష్‌తో ముగించగా, ఈ సారి పవన్ కల్యాణ్ తో ముగించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ ఎపిసోడ్ కోసం భారీ సినిమా ఈవెంట్ జరుగుతున్నంత కోలాహలంతో ప్లాన్ చేశారు ఆహ నిర్వాహకులు. ఇక పవన్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి బాలకృష్ణ తన చిన్న కూతురితో సహా సెట్స్ కి రావడం విశేషం. ఒక హోస్టుగా అతిథి మర్యాద కోసం పవన్ వచ్చే వరకు బాలకృష్ణ ఎదురు చూడడం ఆసక్తిని రేకెత్తించింది.. అయితే పవన్ కోసం బాలయ్య ఎదురు చూడటాన్ని కొందరు వ్యతిరేఖించడంతో పాటు
సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఓ మెగా ఫ్యాన్స్ తన సోషల్ మీడియాలో .. “పేరు తెలీదు అన్నోడే పడిగాపులు కాసేలా చేశావ్ కదా?” అంటూ పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేశాడు. దీంతో నందమూరి అభిమానులు హర్ట్ అయ్యారు. ఇలా మళ్లీ మెగా వర్సెస్ నందమూరి అన్నట్టుగా సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. చిరంజీవి ఎవరు? అంటూ నాడు ఎన్టీఆర్ అన్న మాటలు, పవన్ కళ్యాణ్ పేరు కూడా తెలీదంటూ బాలయ్య చెప్పిన మాటలు అభిమానులు మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ కుంచిత మనస్తత్వం ఆహ్లాదకరమైన కార్యక్రమం పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తుందని.. పవన్ రాక కోసం ఎదురు చూస్తున్న వీడియోని తీసుకుని
Pawan Kalyan : మళ్లీ రచ్చ మొదలు..!!
దీనికి విపరీత అర్థాలు తీయడం సరికాదని హెచ్చరిస్తున్నారు.హోస్టుగా గెస్టుకి ఎదురెళ్లి స్వాగతం చెప్పడం బాధ్యత,అతిధి మర్యాద కాగా, అది బాలయ్య పాటించాడు. అంత మాత్రాన ఇంత వ్యతకారం అవసరంలేదంటూ నందమూరి అభిమానులు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కౌంటర్లు ఇస్తూ వారు హంగామా చేస్తున్నారు. మొత్తానికి మళ్లీ మెగా వర్సెస్ నందమూరి రచ్చ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ షోపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించగా, బావ (చంద్రబాబు)తో తిరిగే పవన్ ఇప్పుడు బావమరిది (బాలకృష్ణ)తో తిరుగుతారు…. అందులో తప్పేముంది? అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.