Neha Shetty : టిల్లు గాడి ఫ్రెండ్ అందాలతో చిత్తడి చేస్తుందిగా.. వైరల్‌గా మారిన ఫొటోలు
Neha Shetty : ఇటీవలి కాలంలో అందాల ముద్దుగుమ్మలు తమ అందచందాలతో ప్రకంపనలు పుట్టిస్తున్నారు. వారిలో నేహా శెట్టి ఒకరు. చూడచక్కటి అందం,ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన ‘మెహబూబా’ సినిమాతో నేహా శెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మెహబూబా సినిమా ఆశించినంత మేర ఆడకపోయినా.. నేహాకు నటన, అందంకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సందీప్ కిషన్‌తో కలిసి ‘గల్లీ రౌడి’ చేసినా.. అది కూడా కమర్షియల్‌గా మంచి విజయం అందుకోలేదు.
సిద్ధు జొన్నలగడ్డతో చేసిన ‘డీజే టిల్లు’ సినిమా నేహా శెట్టికి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా బంపర్ హిట్ కొట్టడంతో నేహా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.’డీజే టిల్లు’ సినిమాలో నేహా శెట్టికి నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమాలో గ్లామర్ డోస్ పెంచి యువతను కూడా ఆకట్టుకున్నారు. డీజే టిల్లు పుణ్యమాని నేహాకు సినీ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే యువ హీరో కార్తికేయ సినిమాలో అవకాశం అందుకున్న ఈ కన్నడ భామకు తాజగా మరో ఆఫర్ దక్కింది. యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న రూల్స్ రంజన్ సినిమాలో డీజే టిల్లు పిల్ల హీరోయిన్‌గా ఎంపికైంది.

neha shetty mind blowing looks
Neha Shetty : నేహా అదరగొట్టేసిందిగా..
టిల్లు భామ గ్లామర్ ఫోటోలు నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.అదే సమయంలో పలు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సక్సెస్ వచ్చిన ఆనందంలో అందాల డోస్ పెంచుతుందని, చూపించడంలో హద్దులు చెరిపేస్తుందని అంటున్నారు. మరోవైపు ఆమె అందాల విందుని ఆరగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నెట్టింట పండగ చేసుకుంటున్నారు. జబ్బలపై స్లీవ్స్ జారిపోతుండగా నేహా శెట్టి ఇచ్చిన విరహంతో కూడిన పోజులు నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి. టాప్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుందీ యంగ్ సెన్సేషన్. నేహా ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ప్రస్తుతం కుర్రాళ్లకి పండగ వాతావరణం తీసుకొస్తుంది.