Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఓరినీ ఇదేం నీచమైన సంస్కృతిరా బాబు
Sridevi Drama Company : ఈటీవీ లో జబర్దస్త్ కామెడీ షో తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన మరో షో శ్రీదేవి డ్రామా కంపెనీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం సమయం లో టెలికాస్ట్ అయ్యే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కి మంచి రేటింగ్ దక్కుతోంది. అదే సమయంలో యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ శ్రీదేవి డ్రామా కంపెనీ షో స్కిట్స్ కు మరియు డాన్స్ పర్ఫార్మెన్స్ లకు దక్కుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రతి వారం ఒక్కొక్క కాన్సెప్ట్ తో ముందుకు వస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తూ ఉంటారు. తాజాగా జబర్దస్త్ లో రాకేష్ టీమ్ లో చేసిన యోధ ను తీసుకొని ఆమెకు ఓనీ ఫంక్షన్ చేయడం ద్వారా ఎపిసోడ్ నీ కానిచ్చేశారు.ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్క రకమైన కాన్సెప్ట్ ను తీసుకోవడం ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనం ఫీలవుతున్నారు. అయితే ఈసారి యోధ యొక్క సారీ ఫంక్షన్ ని చేయడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. అయితే ఈ టీవీ మల్లెమాల వారు చేసిన ఈ ప్రయోగాన్ని కొందరు తప్పు పడుతున్నారు.
ఒక అమ్మాయికి ఫంక్షన్ అంటే ఎంతో హుందాగా చాలా పద్ధతిగా చేయాలి. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో అల్లరి చిల్లరిగా ఆగం ఆగంగా జరిపారు. డబ్బు సంపాదన కోసం ఇలా చేయడం ఏమైనా బాగుందా.. ఒక అమ్మాయికి చాలా ముఖ్యంగా భావించే ఫంక్షన్ ఇలా చేయడం ద్వారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ షో నిర్వాహకులపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ అభిమానులు మాత్రం సదరు ఎపిసోడ్ కి ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిధంగా ఈటీవీ మరియు మల్లెమాల వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.ఫంక్షన్ చేయడం ద్వారా యోధ కి ఏ అమ్మాయికి దక్కని గౌరవం ని కట్టబెట్టారు. కనుక ఆ అమ్మాయి కచ్చితంగా మల్లెమాల వారికి వారికి రుణపడి ఉంటుంది. ఆ అమ్మాయి కుటుంబం మొత్తం కూడా ఖచ్చితంగా ఈటీవీ చేసిన పనికి సంతోషంగా ఉంది. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకు వచ్చారు. ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హాజరైన ఫంక్షన్ కాబట్టి ఇది జనరల్ గానే కుటుంబం చేసే ఫంక్షన్ మాదిరిగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Sridevi Drama Company : జబర్దస్త్ వంటి కామెడీ షో లు రావు
కనుక ఇందులో మల్లెమాల వారిని కానీ ఈటీవీ వారిని కానీ విమర్శించడానికి లేదని కొందరు పనిగట్టుకుని విమర్శించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. వినోదం కోసం చేసిన ఇలాంటి కార్యక్రమాలను వివాదాలను చేసే ప్రయత్నం చేస్తే ముందు ముందు ఖచ్చితంగా ఇలాంటి కామెడీ షో లను చూడటం కష్టం అవుతుంది. ఇప్పటికే కమెడియన్స్ ఎక్కడ ఇలాంటి పంచ్ లు వేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అనే ఉద్దేశంతో పంచ్ ల విషయంలో, కామెడీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ భయపడుతూ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటివి కూడా చేయొద్దు అంటే వారు ఏం చేయాలి అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో యోధ మరియు ఆమె డాడీ చేసిన పర్ఫామెన్స్ మరియు ఇంకా కొన్ని కామెడీ స్కిట్స్ హైలెట్ గా నిలిచాయి. ఈ వారంలో అత్యధికంగా ట్రెండ్ అవుతున్న యూట్యూబ్ వీడియోల జాబితాలో ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కనుక ఎక్కువ శాతం మంది యువత యోధ ఫంక్షన్ శ్రీదేవి డ్రామా కంపెనీ లో జరగడంను స్వాగతించినట్లుగా అనిపిస్తుంది.