Niharika Konidela : మెగా ఫ్యామిలీ ప‌రువు తీస్తున్న నిహారిక‌.. ఇంతగా రెచ్చిపోయిందేంటి.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Niharika Konidela : మెగా ఫ్యామిలీ ప‌రువు తీస్తున్న నిహారిక‌..  ఇంతగా రెచ్చిపోయిందేంటి.. వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :9 December 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Niharika Konidela : మెగా ఫ్యామిలీ ప‌రువు తీస్తున్న నిహారిక‌..  ఇంతగా రెచ్చిపోయిందేంటి..!

Niharika Konidela : మెగా డాట‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. నిహారిక ఢీ షోలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి టీవీ షోలు, సినిమాలు, సిరీస్ లు చేస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా సూప‌ర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ సాధించి హిట్ కొట్టింది. జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కి కాస్త గ్యాప్ ఇచ్చిన నిహారిక విడాకుల త‌ర్వాత తిరిగి కెరీర్‌పై దృష్టి పెట్టింది. నిర్మాత‌గా, న‌టిగా చేస్తూ ఫుల్ బిజీగా మారింది.

Niharika Konidela మెగా ఫ్యామిలీ ప‌రువు తీస్తున్న నిహారిక‌ ఇంతగా రెచ్చిపోయిందేంటి

Niharika Konidela : మెగా ఫ్యామిలీ ప‌రువు తీస్తున్న నిహారిక‌..  ఇంతగా రెచ్చిపోయిందేంటి..!

Niharika Konidela మ‌రీ ఇంత‌లానా..

నిహారిక ప్ర‌స్తుతం త‌మిళ మూవీ మ‌ద్రాస్‌కార‌ణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు షేన్ నిగ‌మ్ హీరోగా న‌టిస్తోన్న ఈ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీకి వాలి మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యి బాగా వైరల్ గా మారింది. హీరోతో హాట్ రొమాన్స్ కూడా చేసింది . దాంతో నిహారికను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు జనాలు. అయితే నిహారిక కి ఇదంతా తెలియని విషయం కాదు . సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని తెలిసిన కూడా అంత బోల్డ్ గా ఎలా నటించడానికి ఒప్పుకుంది అంటే మాత్రం దాని వెనక మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మొదటి నుంచి సాయిధరమ్ తేజ్ నిహారిక కి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అలానే ఈ సినిమా విషయంలో కూడా సపోర్ట్ చేసి నిహారిక ని ఎంకరేజ్ చేశారట. నాగబాబుకి ఇలాంటి వి నచ్చవు. కానీ సాయి ధరమ్ అండ చూసుకొని నిహారిక ఇలా రెచ్చిపోతుందని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం నిహారిక‌కు స‌పోర్ట్ చేస్తోన్నారు. నిహారిక‌ను త‌ప్పు ప‌ట్టేంత సాంగ్‌లో ఏం లేద‌ని అంటున్నారు. వ‌చ్చే ఏడాది ఆరంభంలో మ‌ద్రాస్‌కార‌ణ్ మూవీ వ‌చ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో క‌లైయ‌రాస‌న్‌, ఐశ్వ‌ర్య‌ద‌త్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. మ‌ద్రాస్‌కార‌ణ్ కంటే ముందు త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన ఒరు న‌ళ్ల‌నాళ్ పాథు సోల్రెన్ మూవీలో నిహారిక న‌టించింది. 2018లో ఈ మూవీ రిలీజైంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది