Niharika konidela : వెరైటీ సెలెబ్రేషన్స్.. భర్త పరిస్థితిని చూసి నవ్వుకున్న నిహారిక

Authored By aruna | The Telugu News | Updated on: July 27, 2022, 3:28 pm

Niharika konidela : నిహారిక కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డ పుట్టిన రోజు(జూలై 26)ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక నిహారిక తన భర్త మీదున్న ప్రేమను ఒక్కపోస్ట్‌లో చూపించింది. నా కూలెస్ట్ కుకుంబర్.. నా పిచ్చిని కామ్‌గా భరిస్తుంటావ్.. హ్యాపీ బర్త్ డే అంటూ చైతన్య అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. అలా నిహారిక మొత్తానికి తన భర్త బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక చైతన్య బర్త్ డేను తన జిమ్ మేట్స్ చేసిన సెలెబ్రేషన్స్ చూసి నిహారిక తెగ నవ్వుకుంది.

మామూలుగా అయితే ఇప్పుడు నిహారిక, చైతన్య ఇద్దరూ కూడా హలో వరల్డ్ అనే తమ కొత్త వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అసలే ఇప్పుడు నిహారిక వెబ్ సిరీస్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్‌తో నిహారిక హిట్ కొట్టేసింది. ఇక ఇప్పుడు కొత్తగా వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ, నటిస్తోంది. అలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు హలో వరల్డ్ అంటూ రాబోతోంది. అయితే ఇప్పుడు చైతన్య పుట్టినరోజు సెలెబ్రేషన్స్ చూసి నిహారిక తెగ నవ్వుకుంది.

Niharika konidela laughs at chaitanya jv birthady celebrations at gym

Niharika konidela laughs at chaitanya jv birthady celebrations at gym

జిమ్‌లో చైతన్య వర్కవుట్లు చేస్తుంటే.. జిమ్ మేట్స్, ట్రైనర్ వచ్చి సెలెబ్రేట్ చేస్తుంటారు. అది కూడా చైతన్య వర్కవుట్లు చేస్తుంటే.. ఆయన చెస్ట్ మీద కేక్ పెడతారు. ఇక చైతన్య తన చేతులు రాడ్ పైకి ఎత్తి కిందకు దించుతూ వర్కవుట్లు చేస్తుంటాడు. ఆ క్రమంలో కేక్‌ను చెస్ట్ మీద పెట్టడంతో.. ఆ రాడ్‌తోనే చైతన్య కేక్ కట్ చేసినట్టు అవుతుంది. అలా బర్త్ డేను వెరైటీగా సెలెబ్రేట్ చేశారు. ఈ వీడియోను నిహారిక షేర్ చేస్తూ.. తెగ నవ్వుకుంది. ఇలాంటి బర్త్ డే సెలెబ్రేషన్స్ ఇక్కడే జరుగుతాయంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి నిహారిక, చైతన్యలు మాత్రం నిన్న ఫుల్ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. మామూలుగా అయితే వెకేషన్‌లకు వెళ్లి ఇలాంటి పార్టీలు చేసుకునేందుకు నిహారిక ఇష్టపడుతుంది. కానీ తన వెబ్ సిరీస్ ప్రాజెక్ట్లో బిజీగా ఉండటంతో బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోయినట్టున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp