Niharika Konidela : విడాకులు తర్వాత దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నా… కానీ మా నాన్న చెప్పిన మాటతో… నిహారిక కొణిదల..!

Authored By aruna | The Telugu News | Published on: March 1, 2024, 1:00 pm
  •  Niharika Konidela : విడాకులు తర్వాత దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నా...కానీ మా నాన్న చెప్పిన మాటతో... నిహారిక కొణిదల..!

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి మనందరికీ తెలిసిందే. మొదట పలు రకాల కార్యక్రమాలు మరియు టీవీ షోలలో కనిపించి ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ఇక హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ నిహారికకు అంతగా కలిసి రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పిన నిహారిక కొణిదల జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకుంది. అయితే కొన్నాళ్లపాటు చాలా సాఫిగా సాగిన వీరి వైవాహిక జీవితం తర్వాత విడాకులకు దారి తీసింది. ఇక చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో కూడా కనిపించకుండా కాస్త దూరంగా ఉన్న నిహారిక కొణిదల ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కనిపిస్తూ వస్తుంది. అంతేకాక ఇటీవల తన అన్నయ్య వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పెళ్లిలో నిహారిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాక ఇప్పుడు పలు రకాల సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ అమ్మడు చాలా బిజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోని తాజాగా ఓ మూవీ ప్రెస్ మీట్ కి వెళ్లిన నిహారిక విడాకుల తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యల గురించి మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విడాకులు తర్వాత తాను చాలా మనస్థాపానికి గురైనట్లుగా తెలియజేశారు. అది చాలదు అన్నట్లు సోషల్ మీడియాలో నా గురించి తప్పుగా ప్రచారాలు జరగడం, నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా రావడంతో మరింత కుంగిపోయినట్లుగా తెలియజేశారు. ఇక ఆ సమయంలో నాకు నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారని మరి ముఖ్యంగా మా నాన్న నన్ను ఎంతగానో దగ్గరికి చేర్చుకొని చూసుకున్నారని ఈ సందర్భంగా నిహారిక చెప్పుకొచ్చారు. మా ఫ్యామిలీ నాకు ఎంతలా సపోర్ట్ చేయడం వలన అన్ని దాటుకొని ఇప్పుడు మళ్ళీ అందరిలోకి వచ్చానంటూ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నానంటూ తెలియజేశారు.

అయితే విడాకులు తీసుకొని తాను ఇంట్లో ఏడుస్తూ కూర్చున్న సమయంలో మా నాన్న నా దగ్గరకు వచ్చి తల్లి ఇది కాదు జీవితం అంటే… నువ్వు చూడాల్సింది చేయాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా నిహారిక చెప్పుకొచ్చారు. జీవితంలో కచ్చితంగా మనకు సపోర్ట్ గా నిలబడే భాగస్వామి ఉండాలని అలాంటి భాగస్వామి లేకపోతే మన కుటుంబ సభ్యులే ఆ బాధ్యత తీసుకుంటారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అదేవిధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి కూడా నిహారిక సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు వేరే బిజినెస్ లు ఏమి తెలియవని కేవలం సినిమాలు తీస్తూ దానిలో వచ్చిన డబ్బును రాజకీయాలలో పెడుతూ ఉంటారని తెలియజేసింది.

aruna

No bio available for this author.

  1. "Motakondur : మోటకొండూరును అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలి.. తహసీల్దార్‌కు వినతిపత్రం !"

  2. "Shadnagar Realtors Association : షాద్‌నగర్‌లో ఎన్నికల హీట్.. అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ!"

  3. "Gunde Ninda Gudi Gantalu Today Episode : సుమతి, అరుణ్ పెళ్లి కోసం మీనా సంచలన నిర్ణయం.. బాలు మాటలతో కన్నీళ్లు!"

  4. "Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!"

  5. "Nara Lokesh CM : ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్?.. సీఎంగా లోకేష్.. చంద్రబాబు పాత్ర ఏంటనే చర్చ!"

  6. "Bigg Boss 10 Telugu : ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ.. త్రిగుణ్‌కు షాకిచ్చిన ముకేష్.. ఓటింగ్‌లో కొత్త లెక్కలు !"

  7. "Today Horoscope : 21 నవంబర్ 2026 శ‌నివారం ఈ రోజు మీ రాశి ఫలాలు..ఆ 4 రాశులకు ధనలాభం.. ఊహించని సర్‌ప్రైజ్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp