Nikhil : ఏంటి ఒక్క హిట్ పడగానే.. నిఖిల్ కి కళ్ళు నెత్తికెక్కాయా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nikhil : ఏంటి ఒక్క హిట్ పడగానే.. నిఖిల్ కి కళ్ళు నెత్తికెక్కాయా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :22 October 2022,12:00 pm

Nikhil : హీరో నిఖిల్ తెలుసు కదా. కార్తికేయ 2 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. నిఖిల్ నిజానికి సైడ్ క్యారెక్టర్లు చేసి హీరోగా ఎదిగాడు. కానీ.. తనకు కార్తీకేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చింది. దీంతో తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే చాలు ఇక.. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది నటులు చేసే పనే అది. రెమ్యునరేషన్లు పెంచుతారు.. పలు కండీషన్లు పెడుతారు. తాజాగా నిఖిల్ కూడా అలాగే తన తదుపరి సినిమాలకు కండిషన్లు పెడుతున్నాడట. కార్తికేయ సినిమా కేవలం తెలుగులోనే కాదు..

పలు ఇతర భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో కంటే ఎక్కువ హిట్ అవడంతో హీరో నిఖిల్ తో పాటు డైరెక్టర్ చందు మొండేటికి కూడా మంచి పేరు వచ్చింది. ఇక.. హీరో నిఖిల్ కూడా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తాజాగా పాన్ ఇండియా స్థాయిలో హీరో నిఖిల్ మరో సినిమాలో నటిస్తున్నాడు. అది స్పై మూవీ. తను చేయబోయే సినిమాకు మార్కెట్ కు తగ్గట్టుగానే బడ్జెట్ ఉండాలని నిఖిల్ డిమాండ్ చేస్తున్నాడట. తన మరో సినిమా 18 పేజెస్ ఇప్పటికే రిలీజ్ కు సిద్ధంగా ఉంది కానీ.. కార్తికేయ 2 సినిమా సూపర్ డూపర్ హిట్ తో మరోసారి ఆ సినిమాను షూట్ చేయనున్నారట. కార్తికేయ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది.

Nikhil he got a single hit

Nikhil he got a single hit

Nikhil : కార్తికేయ 2 కు సీక్వెల్ కూడా వస్తోంది

అయితే.. తను నటించే తదుపరి సినిమాలకు అన్నింటికీ నిఖిల్ కండిషన్లు పెడుతున్నాడట. ప్రతి సినిమాలోనూ తన రెమ్యునరేషన్ ను పెంచడంతో పాటు బడ్జెట్ పెంచాలని అడుగుతున్నాడట. దీంతో దర్శకనిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట. ఒక్క సినిమా సక్సెస్ రాగానే ఇంతలా డిమాండ్ చేయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారట. ప్రస్తుతం నిఖిల్ చేతుల్లో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు విడుదలై.. సూపర్ సక్సెస్ అయితే ఇక నిఖిల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. స్టార్ హీరోగా ఎదిగిపోవడమే కాదు.. పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు నిఖిల్. చూద్దాం మరి.. తన తదుపరి సినిమాలు నిఖిల్ ఫేట్ ను డిసైడ్ చేస్తాయో లేదో?

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది