Nikhil Movie : నిఖిల్ మూవీ షూటింగ్‌లో ఊహించని ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు.. వీడియో..!
ప్రధానాంశాలు:
Nikhil Movie : నిఖిల్ మూవీ షూటింగ్‌లో ఊహించని ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు.. వీడియో..!
Nikhil Movie : యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కొత్త సినిమా షూటింగ్‌లో ఊహించని ప్రమాదం సంభవించింది. కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం ఎదురైంది.. నిఖిల్ సిద్ధార్థ్ ‘ది ఇండియా హౌస్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శంషాబాద్ సమీపంలో చిత్ర షూటింగ్ బుధవారం జరుగుతుండగా ఓ ప్రమాదం సంభవించింది. సముద్రపు సన్నివేశాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పగిలి పోయింది. . దీంతో షూటింగ్ లొకేషన్ మొత్తం నీటితో నిండిపోయింది.

Nikhil Movie : నిఖిల్ మూవీ షూటింగ్‌లో ఊహించని ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు
Nikhil Movie : అనుకోని ప్రమాదం..
ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలయ్యాయని.. మరి కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఒకరి మినహా మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.నీళ్లన్నీ సెట్‌లోకి వరదలా పోటెత్తడం తో సెట్ నాశమైందని సమాచారం. ఇక లైట్లు.. కెమెరాలు.. ఇతర సినిమా షూటింగ్ సామగ్రి దెబ్బతిందని చిత్రబృందం తెలిపింది.
చారిత్రక నేపథ్యంతో ది ఇండియా హౌస్ సినిమా తెరకెక్కిస్తున్నారు. వీర్ సావర్కర్, నాథూరామ్ గాడ్సే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అభిషేక్ అగర్వాల్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి మజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండేళ్ల కిందట ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ నిలకడగా సాగుతోంది.
హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న “ది ఇండియన్ హౌస్” సినిమా షూటింగ్‌లో ప్రమాదం.
శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోయింది.
వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో షూటింగ్ లొకేషన్ మొత్తం వరదతో నిండిపోయింది.
ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరా మెన్‌కు తీవ్ర… pic.twitter.com/0WCXhxIOG1
— greatandhra (@greatandhranews) June 11, 2025