Nirupam Paritala : డాక్టర్ బాబు మామూలోడు కాదు.. అక్కడ కూడా వదిలిపెట్టలేదు!
Nirupam Paritala బుల్లితెరపై నిరుపమ్ పరిటాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే స్టేజ్ ఏది అన్నా.. ముందు ఎవ్వరున్నారు అనేది కూడా నిరుపమ్ చూడరు. పంచ్‌లు ప్రాసలతో ఆడుకుంటాడు. అలా జీ తెలుగు కుటుంబం అవార్డు వేడుకల్లో నిరుపమ్ దుమ్ములేపేశాడు. అదిరిపోయే హాట్ పర్ఫామెన్స్‌తో నిరుపమ్ రచ్చ చేశాడు. మోనితో కలిసి డాక్టర్ బాబు జీ తెలుగు వేదిక మీద డ్యాన్స్ చేశాడు.

nirupam paritala at zee kutumbham awards
ఇక అదే ఈవెంట్‌లో నిరుపమ్ స్టేజ్ మీద కౌంటర్లు వేశాడు. ఊహలు గుసగుసలాడే సీరియల్ హీరో అకుల్ మీద కౌంటర్లు వేశాడు. తన తల్లిని స్టేజ్ మీదకు తీసుకొచ్చి సత్కరించాడు అకుల్. కాళ్లను నీళ్లతో కడిగి సత్కరించాడు. ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా అమ్మే.. అంటూ అకుల్ తన అమ్మ మీదున్న ప్రేమను అందరికీ చూపించాడు
Nirupam Paritala : జీ కుటుంబం అవార్డుల్లో నిరుపమ్

nirupam paritala at zee kutumbham awards
చిన్నప్పుడు అకుల్ తెగ అల్లరి చేసేవాడు అని.. బాలయ్య అని పిలచేవాళ్లమని అకుల్ అమ్మ చెప్పింది. అకుల్ చెప్పింది వినేవాడు కాదు.. తలను నేలకేసి కొట్టుకునే వాడంటూ చిన్నప్పటి అల్లరి చేష్టల గురించి చెప్పింది. అందుకేనా ఈ సమస్య వచ్చింది అని ప్రదీప్ కౌంటర్ వేశాడు. చిన్నప్పుడు ఆయన తలకొట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన వల్ల మేం తలకొట్టుకుంటున్నామని పక్క నుంచి డాక్టర్ బాబు కౌంటర్ వేశాడు.
