Nirupam Pariutala : డాక్టర్ బాబు మామూలోడు కాదు.. మంజులపై నిరుపమ్ సెటైర్ల వర్షం
Nirupam Pariutala : కార్తీకదీపం సీరియల్‌తో డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలో అందరికీ దగ్గరయ్యాడు నిరుపమ్. అయితే నిరుపమ్ భార్యగా మంజుల పరిటాలకు కూడా నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. డాక్టర్ బాబు భార్య అంటూ మంజులను అందరూ ఆటపట్టిస్తుంటారు. కానీ తాను డాక్టర్ బాబు భార్యను కాదు.. నిరుపమ్ భార్యను అని అంటుంటుంది. ఈ ఇద్దరూ నెట్టింట్లో చేసే హంగామా మామూలుగా ఉండదు.మంజుల గత రెండు మూడు నెలల క్రితం యూట్యూబ్ చానెల్‌ను పెట్టిన సంగతి తెలిసిందే. మంజుల నిరుపమ్ అనే ఈ యూట్యూబ్ చానెల్ ద్వారా నిరుపమ్ వ్యక్తిగత విషయాలెన్నో బయటకు వస్తున్నాయి.
మంజుల చేసే ఈ వీడియోలు అందరినీ మెప్పిస్తున్నాయి. ఇవి ఎక్కువగా నిరుమప్ ఇంట్లోనే చేస్తుంటుంది. అలా మొత్తానికి నిరుపమ్ మంజుల చానెల్ ద్వారా అభిమానులకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.తాజాగా మంజుల ఓ వీడియో చేసింది. మదర్స్ డే సందర్భంగా ఈ వీడియోను చేసింది. అయితే తన భర్త నిరుపమ్, కొడుకు రిక్కికి ఆ విషయం గుర్తుందో లేదో అని తెలుసుకునేందుకు మంజుల నానా తంటాలు పడింది. ప్రతీ ఏడాది తనకు విషెస్ చెప్పేవాడని, కానీ ఈ సారి మాత్రం రిక్కీ ఇంకా చెప్పలేదు అసలు గుర్తుందా? లేదా? అని కనుక్కునే ప్రయత్నం చేస్తుంటుంది మంజుల.

Nirupam Pariutala Satires on Manjula in Mothers day Video
ఈ రోజు ఏంటి? అని మంజుల అడుగుతుంది.. సండే అని చెబుతారు. స్పెషల్ ఏంటి? అని అడిగితే.. నాన్ వెజ్ కదా? అని అంటారు. దీంతో మంజుల తలపట్టుకుంటుంది. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. సినిమా చూసుకోవాలని తండ్రీ కొడుకులుఅంటారు. వెళ్లి నీ వ్లాగ్ చేసుకో అని సెటైర్ వేస్తారు. నేను చేసేది మీతోనే అని మంజుల అంటే.. మమ్మల్ని అడిగావా? మా డేట్స్ అడిగావా? మేం ఫ్రీగా లేం.. సినిమా చూడాలని అని మంజులకు నిరుపమ్ కౌంటర్లు వేస్తాడు.
