Nithya Menen : చేపల మార్కెట్‌లో చేపలు బేరం ఆడిన నిత్యా మీనన్.. నోరెళ్లపెడుతున్న నెటిజన్స్
Nithya Menen : సాధారణంగా సెలబ్రిటీలు జనాల మధ్యకు రావడానికి చాలా ఆలోచిస్తుంటారు. ఒక్కసారికి బయటకు వచ్చారంటే సెల్ఫీలంటూ నానా హంగామా చేస్తారని వారు అలాంటి పనులు అస్సలు చేయరు. అయితే నిత్యా మీనన్ ధైర్యం చెప్పి చేపలు కొనడానికి వెళ్లింది. ఒక చేపల కొట్టు దగ్గర నిలబడి చేపల అమ్మే వారితో మాట్లాడుతూనే .. ఇంకొక వైపు ఏదో తింటూ మాట్లాడుతూ ఉంది. నిత్యా మీనన్ ఇంత డేర్ చేయడం పట్ల నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది షూటింగ్‌లో భాగం అని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం ఇది రియల్ లైఫ్‌లోనే జరిగి ఉంటుందని అంటున్నారు.
ఏదేమైన ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. మలయాళ కుట్టి నిత్యామీనన్ తెలుగులో వరుసగా ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. చివరిగా మనకు భీమ్లా నాయక్, స్కైల్యాబ్ సినిమాల్లో నిత్యా కనిపించింది. ఆహ తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇలా సినిమాలు, షోలు, సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది నిత్య మీనన్. ఈ అమ్మడు నటించిన వెబ్ సిరీస్ ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ జులై 8 నుంచి అమెజాన్ లో టెలికాస్ట్ అవుతుంది. ఇందులో నిత్యా మీనన్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిత్యా మీనన్ తన నటనకు గాను ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
Nithya Menen : షాకిచ్చిన నిత్యా..
ఒకప్పుడు వరుస చిత్రాలలో నటించిన నిత్యా మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాలో చిన్న పాత్ర పోషించిన ఈమె ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి భార్య పాత్రలో నటించి ఇరగదీసిందని చెప్పవచ్చు. 8 సంవత్సరాల వయసులో ద మంకీ హు న్యూ టూమచ్ (1998) అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 17 సంవత్సరాల వయసులో 2006 లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి.
