Nithya Menen : న‌న్ను పెళ్లి చేసుకోమ‌న్న హీరోనే, బ్యాన్ చేస్తామ‌న్నారంటూ నిత్యా మీన‌న్ షాకింగ్ కామెంట్స్

Authored By Sam C | The Telugu News | Published on: August 20, 2022, 4:40 pm

Nithya Menen : నిత్యా మీన‌న్ .. ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రు. చివ‌రిగా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇప్పటికీ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే ఆమె కెరియర్లో పెద్దగా క్లిక్ అవ్వలేదని చెప్పాలి. ఈ మధ్యనే తెలుగులో మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న ఆమె తన జీవితానికి సంబంధించిన ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. కేరళకు చెందిన సంతోష్ వర్కీ అనే వ్యక్తి తనను ఇబ్బందులు పెట్టినట్లు వెల్లడించారు. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆరాట్టు అనే సినిమాను డీకోడ్ చేసిన సంతోష్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించి వార్తల్లోకి ఎక్కాడని, అప్పటినుంచి అతను తన గురించి అనేక విషయాలు ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ తనను ఇబ్బంది పెడుతున్నాడని, ఒకరకంగా మానసికంగా వేధిస్తున్నాడని నిత్యామీనన్ వెల్లడించారు.

Nithya Menen : అలా అనేసింది ఏంటి?

‘నా పెళ్లి గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన వార్త‌ల్లో అస్స‌లు నిజం లేదు. సినిమా షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉంటూ వ‌స్తున్నాను. అదే స‌మ‌యంలో కాలు బెణికింది. దాంతో కాస్త రెస్ట్ దొరికిన‌ట్ట‌య్యింది. ఆ స‌మ‌యంలో క‌థ‌లు చెబుతామ‌ని కొంద‌రు అన్నారు. అయితే రెస్ట్ తీసుకోవాల‌నే ఉద్దేశంతో ఇప్పుడు విన‌ట్లేదు అని చెప్పాను. ఎందుకు నిత్యా మీన‌న్ క‌థ‌లు విన‌టం లేదు అనే ప్ర‌శ్న అక్క‌డే మొద‌లైంది. నిత్యా మీన‌న్ క‌థ‌లు విన‌టం లేదంటే పెళ్లి చేసుకుంటుందేమో అనే వార్త‌లు పుట్టేశాయి’’ అన్నారు. నేను ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే..నన్ను సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు పుట్టించారు. చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. రీసెంట్‌గా నిత్యామీన‌న్ తిరు అనే సినిమాతో ప‌ల‌క‌రించింది.

Nithya Menen Comments About Rumours On Her Marriage

Nithya Menen Comments About Rumours On Her Marriage

నాతో ప‌నిచేయని వారే అలా చెబుతుంటారు. రూమ‌ర్స్ క్రియేట్ చేసేవాళ్లు చాలా త‌క్కువ‌గా ఆలోచిస్తున్నార‌ని నేను అనుకుంటాను. మ‌నం వాళ్ల‌లాగా కింద‌కెళ్లి మేనేజ్ చేయాల్సిన అవ‌సరం లేదు. అది వాళ్ల జీవితం. ప‌క్క‌వాళ్ల గురించి కావాల‌నే మాట్లాడ‌టం మన‌కే మంచిది కాదు. నేను నా ప‌నిలో సంతోషాన్ని వెతుక్కుంటాను. అంద‌రి గురించి నేను ఆలోచిస్తూ పోతే నా ప‌నులు చేసుకోవ‌డానికి స‌మ‌యం దొర‌క‌దు అని నిత్యా మీన‌న్ ప‌లు విష‌యాలు చెప్పుకొచ్చారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp