Nithya Menen : ఓహో.. నిత్యా మీన‌న్ కూడా పెళ్లి పీట‌లెక్కేస్తోంది.. వ‌రుడు మ‌రెవరో కాదు..!

Authored By Sam C | The Telugu News | Published on: July 18, 2022, 8:00 pm

Nithya Menen : నిత్యా మీన‌న్‌.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుపరిచితం. గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘భీమ్లా నాయక్’ మూవీలో అలరించిన నిత్యా మీనన్ .. ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్స వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో నిత్యా మీనన్‌తో పాటు రేవతి, నరేష్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్, మాళవిక నాయర్, సుహాసిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 8వ తేదీ నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న స‌మ‌యంలోనే ఈ అమ్మ‌డు వెబ్ సిరీస్‌లు చేస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

చేసినవి కొన్ని సినిమాలే అయినా అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యా మీనన్ ఇటీవ‌ల‌ ఓ షోకు జడ్జిగానూ వ్యవహరించింది. సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ మొదలుపెట్టింది. నిత్య అన్‌ఫిల్టర్డ్’ పేరుతో యూట్యూబ్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. తన 12ఏళ్ల సినీ కెరీర్‌కి సంబంధించిన విషయాలను వీడియోల‌లో తెలియ‌జేస్తుంది. ఇక యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన కాసేపటికే వేలమంది ఫాలోవర్లు వచ్చి చేరారు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి యూట్యూబ్ ఛానెల్ సక్సెస్ ఫుల్‌గానే న‌డుస్తుంది. అయితే ఈ అమ్మ‌డి తోటి హీరోయిన్స్ అంద‌రు పెళ్లి పీట‌లు ఎక్కుతుండ‌గా, నిత్యా పెళ్లిపై అంద‌రిలో చాలా అనుమానాలు ఉన్నాయి.

Nithya Menen marriage news viral

Nithya Menen marriage news viral

Nithya Menen : నిత్యా ప్రేమాయ‌ణం..

స్టార్ హీరోలను సైతం తన అభిమానులు గా మార్చుకున్న నిత్యా మీనన్..ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతుంది అంటూ ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. నిత్యా మీన‌న్ వారితో వీరితో రిలేష‌న్‌లో ఉంద‌ని ఒక్క గాసిప్ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. నిత్యా మీనన్ పై ఒక్క న్యూస్ కూడా అలా చెడుగా రాలేదు. కానీ, ఇలా సడెన్ ఆమె పెళ్ళి వార్త నెట్టింట ప్రత్యేక్ష మవ్వడం ..అభిమానులకు షాకింగ్ గా ఉంది. అంతేకాదు, ఆమె పెళ్ళి చేసుకోబోయేది మలయాళ స్టార్ హీరోనే అని కూడా తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు నుండి కూడా తన తో ఫ్రెండ్ షిప్ ఉండేదట. ఇక ఆ పరిచయం,..అలా అలా స్నేహంగా..ఆ తరువాత ప్రేమగా మారిన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై నిత్యా స్పందిస్తుందా అనేది చూడాలి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp