Anasuya : జబర్దస్త్ షోలో ఏం చేయడం లేదా?.. అనసూయ మీద నూకరాజు సెటైర్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : జబర్దస్త్ షోలో ఏం చేయడం లేదా?.. అనసూయ మీద నూకరాజు సెటైర్లు

 Authored By prabhas | The Telugu News | Updated on :9 July 2022,12:00 pm

Anasuya : అనసూయ ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా షోలు చేస్తోంది. మరో వైపు ఈవెంట్లు చేస్తోంది. ఇంకె వైపు సినిమా షూటింగ్లతో బిజీగా ఉంటోంది. అలా అనసూయ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. జబర్దస్త్ షో, స్టార్ మాలో సింగింగ్ షో చేస్తోంది అనసూయ. ఈ విషయం మీదే తాజాగా నూకరాజు కౌంటర్లు వేశాడు. జబర్దస్త్ షోలో అనసూయ ఏం చేయడం లేదు.. రెస్ట్ తీసుకుంటున్నందన్నట్టుగా కౌంటర్లు వేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో నూకరాజు మాహిష్మతి టైపులో ఓ రాజ్యంలా సెట్ వేశారు.

దీంట్లో భాగంగా కార్తీకదీపం పిల్లలు హిమ, శౌర్యలు వచ్చారు. అనసూయ రాణి ఎలా ఉందంటూ నూకరాజును శౌర్య అడుగుతుంది. ఆవిడకేంటి బాగానే ఉంది.. ఈ రాజ్యంలో జబర్దస్త్ పక్క రాజ్యంలో పాటల ప్రోగ్రాం సాయంత్రానికి ఈవెంట్ చేసుకుని పొద్దున ఐదు గంటలకు రెస్ట్ తీసుకుంటోంది అని లిస్ట్ చెప్పుకుంటూ పోతాడు. దీంతో అనసూయ పకపకా నవ్వేస్తుంటుంది. అబ్బో ఆమెకు రెస్ట్ తీసుకునే టైం కూడా ఉందా? అని శౌర్య మళ్లీ అడుగుతుంది. మనం స్కిట్లు చేస్తున్నప్పుడు ఆమె చేసే పని అదే కదా? అని నూకరాజు కౌంటర్లు వేస్తాడు. దీంతో అనసూయ మరింతగా నవ్వేస్తుంది. మొత్తానికి అనసూయ మాత్రం జబర్దస్త్ సెట్‌లో బాగానే సుఖాన్ని అనుభిస్తున్నట్టుంది.

Nookaraju Satires on Anasuya Bharadwaj Doing Jabardasth SHow

Nookaraju Satires on Anasuya Bharadwaj Doing Jabardasth SHow

స్కిట్లు జరిగే సమయంలో అనసూయ రెస్ట్ తీసుకుంటుందన్నమాట. అనసూయ మాత్రం ఇప్పుడు నిజంగానే ఫుల్ బిజీగా ఉంటోంది.అక్కడా ఇక్కడా ఫుల్ టైం చేయలేకపోతోంది. అందుకే జబర్దస్త్ షోను మానేసినట్టుంది. ఆల్రెడీ ఈ మేరకు ఓ ప్రకటన కూడా ఇచ్చింది. కానీ అందులో జబర్దస్త్ పేరు ఎక్కడా చెప్పలేదు. కానీ జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్లిపోయినట్టు.. ఆమె స్థానంలో బిగ్ బాస్ స్రవంతిని తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒక వేళ బిగ్ బాస్ స్రవంతి వస్తే షో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అసలే ఆమె మీద నెగెటివిటీ ఎక్కువడా ఉంది. కానీ ఆమె ఈ మధ్య చేస్తోన్న అందాల విందు, తొడల ప్రదర్శన మాత్రం జబర్దస్త్ షోకు బాగానే కలిసి వచ్చేలా ఉంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి