NTR 30 Movie : 9 భాషల్లో ఎన్టీఆర్‌30 సినిమా.. ఇది మరీ ఓవర్ గా అనిపించడం లేదా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR 30 Movie : 9 భాషల్లో ఎన్టీఆర్‌30 సినిమా.. ఇది మరీ ఓవర్ గా అనిపించడం లేదా?

 Authored By prabhas | The Telugu News | Updated on :28 August 2022,8:00 am

NTR 30 Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ. 100 కోట్ల బడ్జెట్ని దర్శకుడు కొరటాల శివ ఖర్చు చేయబోతున్నాడు అంటూ ఆమధ్య ప్రచారం జరిగింది. కానీ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా దారుణమైన పరాజయం పాలవ్వడంతో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. అసలు ఎన్టీఆర్ సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా ఒకానొక సమయంలో పుట్టుకు వచ్చాయి.

ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ ఆమధ్య మాట్లాడుతూ ఒక భారీ బడ్జెట్ సినిమా కనుక స్క్రిప్ట్ కార్యక్రమాలకు కాస్త సమయం ఎక్కువ తీసుకోవలసిన అవసరం ఉంటుంది. అందుకే దర్శకుడు కొరటాల శివ కాస్త ఎక్కువ సమయంను తీసుకుంటున్నాడని త్వరలోనే ఆయన ఒక మంచి కథను తయారు చేయబోతున్నాడని చెప్పుకొచ్చాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొదట అనుకున్న కథ కాదని, ఎన్టీఆర్ కోసం ఒక భారీ పాన్ ఇండియా సినిమాను తీయడం కోసం కొరటాల శివ స్క్రిప్టు పూర్తిగా మార్చేశాడని తెలుస్తోంది. కొత్త కథతో సినిమాను రూపొందించబోతున్నారని సమాచారం అందుతుంది. మరో నిర్మాత అయిన సుధాకర్ ఇటీవల ఒక మీడియా ప్రతినిధి వద్ద మాట్లాడుతూ ఈ సినిమాను ఏకంగా తొమ్మిది భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

NTR 30 movie going to release 9 languages is a big joke

NTR 30 movie going to release 9 languages is a big joke

సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే సౌత్లో నాలుగు భాషలతో పాటు నార్త్ లో హిందీలో విడుదల చేస్తారు. అలా కాదని 9 భాషల్లో విడుదల చేస్తాం అంటూ ప్రకటించడం అనేది కాస్త ఓవర్ అంటూ నందమూరి అభిమానులు స్వయంగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేసి సక్సెస్ అయితే చాలు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతాయి. 9 భాషల్లో పది భాషల్లో సినిమాను విడుదల చేయాల్సిన అక్కర్లేదు అంటూ వారు నిర్మాతకు చురకలంటిస్తున్నారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా నవంబర్ లో పట్టాలెక్కే అవకాశం ఉంది. అంటే వచ్చే ఏడాది చివరికి గాని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమా విడుదలవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది