NTR 30 Movie : ఎన్టీఆర్‌ 30 ఆలస్యం వెనుక మెగా కుట్ర కోణం ఉందట! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR 30 Movie : ఎన్టీఆర్‌ 30 ఆలస్యం వెనుక మెగా కుట్ర కోణం ఉందట!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 October 2022,12:00 pm

NTR 30 Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ సినిమా గందరగోళంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ తదుపరి సినిమా పై ప్రభావం పడింది. కొరటాల శివ ఇప్పటికే ఎన్టీఆర్ తో సినిమా మొదలవ్వాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు సినిమా ప్రారంభం అవ్వలేదు. ఈ ఆలస్యం వెనుక మెగా కాంపౌండ్ కు చెందిన కొందరు ఉన్నారంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో నిజం ఎంత అనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30వ సినిమా ఆలస్యం కి కారణం కొరటాల శివ రెడీ చేసిన స్క్రిప్టు నచ్చకపోవడమే అని దాంట్లో మెగా కాంపౌండ్ కు సంబంధించిన వాళ్ల ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమాకు మెగా కాంపౌండ్ కి లింక్ పెట్టి కొందరు చేస్తున్న కామెంట్స్ ఏ మాత్రం సరి కాదు అంటూ వెండి తెర వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఎన్టీఆర్ 30 సినిమా కు సంబంధించి ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు సినిమా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయినా కూడా అభిమానులు హీరోయిన్ ఆమె.. సంగీత దర్శకుడు ఇతడు అంటూ రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మరియు రాంచరణ్ మధ్య పోటీ నెలకొంది.

NTR 30 Movie late due to mega family fans say nandamuri fans

NTR 30 Movie late due to mega family fans say nandamuri fans

ఆ కారణంగానే ఎన్టీఆర్ ఎదగకుండా కొందరు కుట్ర చేసి సినిమా రాకుండా ప్రయత్నిస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు కొందరున్నారు. నందమూరి ఫ్యాన్స్ ఈ విషయం లో ఎక్కువగా ఆలోచిస్తున్నారని.. మెగా కాంపౌండ్ కు చెందిన ఏ ఒక్కరు కూడా ఎన్టీఆర్ సినిమా ఆపేసేందుకు ప్రయత్నించరు అని.. ఆ సినిమా విషయంలో మెగా కాంపౌండ్‌ వారి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అంటూ కొందరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది