Sukumar Daughter function : సుకుమార్ ఇంట్లో వేడుక.. హాజరైన ఎన్టీఆర్, మహేష్ బాబు
Sukumar Daughter function : టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షించేశాడు. తాను బ్లాక్ బస్టర్ హిట్లు తీయడమే కాదు.. తన శిష్యుడితోనూ బ్లాక్ బస్టర్ తీయించాడు. అలా గురువుగానూ సుకుమార్ స్థాయి ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. అలాంటి డైరెక్టర్ ఇంట్లో వేడుక అంటే అందరూ హాజరవుతారు. అలా సుకుమార్ తన కూతురి ఫంక్షన్‌కు తన హీరోలందరినీ ఆహ్వానించాడు. అందులో భాగంగానే తన హీరోలను ప్రత్యేకంగా ఆహ్వానించాడు.

NTR and Mahesh babu at Sukumar Daughter function
Sukumar Daughter function : సుకుమార్ ఇంట్లో వేడుక.. హాజరైన ఎన్టీఆర్, మహేష్ బాబు
ఈ ఈవెంట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి విచ్చేశాడు. నాగచైతన్య, సమంత కూడా జంటగా వచ్చి వేడుకలో తెగ సందడి చేసింది. క్లీన్ షేవ్‌తో నాగచైతన్య స్టైలిష్ లుక్‌లో కనిపించగా మోడ్రన్ డ్రెస్‌లో సమంత స్పెషల్ అట్రాక్షన్ అయింది. మహేష్, నమ్రత సింప్లీ సూపర్ అన్నట్లుగా ఆకట్టుకున్నారు. వీళ్ళతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఫంక్షన్‌లో మెరిశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NTR and Mahesh babu at Sukumar Daughter function
అయితే బన్నీ, చెర్రీ మాత్రం ఈ ఈవెంట్‌లో కనిపించలేదు. చెర్రీ ఆచార్య షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు పుష్ప సినిమా షూటింగ్ తమిళనాడులో జరుగుతోంది. జానీ మాస్టర్ నేతృత్వంలో ఓ పాటను చిత్రీకరించబోతోన్నారు. ‘పుష్ప’ సినిమా పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండతో ఓ సినిమాను చేయనున్నారు సుకుమార్. ఆ మధ్యే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.