Priyanka Jain : పెళ్లికి ముందే అన్ని చేసేస్తున్నారంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ పరువు తీసిన ఓంకార్
ప్రధానాంశాలు:
Priyanka Jain : పెళ్లికి ముందే అన్ని చేసేస్తున్నారంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ పరువు తీసిన ఓంకార్
Priyanka Jain : యాంకర్‌గా,దర్శకుడిగా సత్తా చాటుతున్నారు ఓంకార్. ప్రస్తుతం ఇస్మార్ట్ జోడి 3 అనే షోకి యాంకర్‌గా చేస్తున్నారు. ఈ వారం రీల్ జోడి Vs రియల్ జోడి థీమ్ పెట్టాడు ఓంకార్. ఇందులో భాగంగా స్టార్ మా సీరియల్ జోడీలు సందడి చేశాయి. నువ్వుంటే నా జతగా (అర్జున్ కళ్యాణ్-అనుమితా దత్తా), మగువా ఓ మగువా (శ్రవణ్ కుమార్-కృతిక), మామగారు (ఆకర్ష్-సుహాసిని), మౌనరాగం (ప్రియాంక జైన్-శివకుమార్), చిన్ని (వీరేన్-కావ్యశ్రీ), పలుకే బంగారమాయెనా (సంధ్య-నిఖిల్ నాయర్) సీరియల్స్ నుంచి హీరోహీరోయిన్లు ఈ ఎపిసోడ్‌లో మెరిశారు.

Priyanka Jain : పెళ్లికి ముందే అన్ని చేసేస్తున్నారంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ పరువు తీసిన ఓంకార్
Priyanka Jain ఓంకార్ అలా అన్నాడేంటి..
ప్రియాంక జైన్-శివకుమార్‌ల గురించి ఆడియన్స్‌కి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రియాంక-శివ రిలేషన్‌లో ఉంటున్నారు. ఇప్పటివరకూ పెళ్లి డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు. ఇద్దరూ కలిసే ఉంటూ తమ లవ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇస్మార్ట్ జోడికి వచ్చిన ప్రియాంక-శివ ఓ రొమాంటిక్ సాంగ్‌కి పెర్ఫామ్ చేశారు. ఇక వీరిని చూడగానే ఓంకార్ అన్నయ్య ఓ సెటైర్ వేశాడు.
పెళ్లి తర్వాత ఎంజాయ్ చేయాల్సినవి అన్నీ కూడా.. అన్నీ పెళ్లికి ముందే అన్నీ.. అంటూ ఓంకార్ ఓ డైలాగ్ కొట్టాడు. దీనికి ప్రియ-శివలతో పాటు అక్కడున్న జోడీలన్నీ నవ్వుకున్నాయి.దీంతో మీరు ఏదో ఊహించుకుంటున్నారు.. నేను వేరే చెబుతున్నా అంటూ ఓంకార్ కవర్ చేశాడు. అయితే మిగిలిన వాళ్లు మాత్రం లేదన్నా మీరు ఏదనుకొని చెప్పారో మేము అదే ఊహించుకున్నాం అంటూ డైలాగ్ కొట్టారు. శివ అయితే ఏంటి ఓంకార్ అన్నయ్య ఇలా బుక్ చేసేశాడు అన్నట్లు ఫేస్ పెట్టాడు.