Punch Prasad : చావు, రోగం మీద సైతం సైటర్లు!.. పంచ్ ప్రసాద్ మామూలోడు కాదు
Punch Prasad : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఇలా ఒక కార్యక్రమానికి పోటీగా మరి కొన్ని కార్యక్రమాలు వస్తూ ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తమదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇలా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. శ్రీదేవి డ్రామా కంపెనీలో జబర్దస్త్ కమెడియన్స్ తమదైన శైలిలో స్కిట్లు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రోమోలో భాగంగా స్వర్గంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోమోలో పంచ్ ప్రసాద్, రాకెట్ రాఘవ, పొట్టి నరేష్ వంటి వారు వివిధ స్కిట్ లతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. ఈ సందర్భంగా పంచ్ ప్రసాద్ రాకెట్ గురించి మాట్లాడుతన్న సమయంలో దేవుడి వేషంలో ఉన్నటువంటి రాఘవ అక్కడికి వెళ్తారు. ఆ సమయంలో నూకరాజు సార్ మా అన్నయ్య అంటూ పంచ్ ప్రసాద్ పరిచయం చేస్తాడు.

Rocket Raghava Comments on Punch prasad in sridevi drama company
Punch Prasad : పంచ్ ప్రసాద్ వ్యాధిపై సెటైర్లు:
ఈ క్రమంలోనే రాకెట్ రాఘవ పంచ ప్రసాద్ ను దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. ఇలా ఆశీర్వదించగానే పంచ్ ప్రసాద్ మన గురించి తెలియదా.. నీకు అంటూ కామెంట్ చేస్తారు. అయితే గతంలో పంచ్ ప్రసాద్ తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ చావుబతుకుల నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో జబర్దస్త్ కమెడియన్స్ తనకు ఎంతో అండగా నిలిచారని పలు సందర్భాలలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇలా చావుబతుకుల నుంచి బయటకు వచ్చిన పంచ్ ప్రసాద్ ను ఈ స్కిట్ లో దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించడంతో పంచ్ ప్రసాద్ తమదైన శైలిలో సమాధానం చెప్పి అందరినీ నవ్వించారు.
